న‌రసాపురం ఎంపీ: బీజేపీ శ్రీనివాస‌రాజు గారు ఇక ఎంపీ రాజు గారోచ్‌

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్ లోనే జనసేన బీజేపి తెలుగుదేశం పార్టీ కూటమి చాలా అంటే చాలా బలంగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గం న‌రసాపురం ఒకటి. వాస్తవంగా చూస్తే గత ఎన్నికలలోనే జనసేన ఒంటరిగా పోటీ చేసిన నరసాపురం పార్లమెంటు పరిధిలో చాలా బలమైన ప్రభావం చూపింది. నరసాపురం, భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్లలో గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన జనసేన.. పాలకొల్లు, ఆచంట, తణుకులో.. తాడేపల్లిగూడెంలో కూడా గణనీయమైన ఓట్లు సాధించి తెలుగుదేశం పార్టీ కి చావు దెబ్బ కొట్టింది. పైగా నరసాపురం పార్లమెంటు పరిధిల బీజేపికి కూడా చెప్పుకోదగ్గ బలం ఉంది.

గతంలో ఇక్కడ నుంచి బీజేపి ఎంపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ పార్లమెంటుకు అభ్యర్థులు మారారు. కూటమిలో భాగంగా బీజేపి నుంచి భీమవరం పట్టణానికి చెందిన భూపతి రాజు, శ్రీనివాస వర్మ పోటీ చేయగా.. వైసీపీ నుంచి భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది గూడూరి ఉమాబాల పోటీ చేశారు. శ్రీనివాస్ వర్మ క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. ఉమాబాల బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు. నరసాపురం పార్లమెంటు సీటును ప్రజారాజ్యం తర్వాత వైసీపీ ఈ సామాజిక వర్గానికి కేటాయించింది.

ఈ పార్లమెంటు పరిధిలో శెట్టిబలిజ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో.. జగన్ బీసీ ప్లస్ మహిళ ఈక్వేషన్‌తో ఉమాబాల‌తో సీటు కేటాయించారు. ఎన్నికల ముందు హడావుడి, ఎన్నికల ప్రచారం పోలింగ్ బట్టి చూస్తే పార్లమెంటు పరిధిలో ఆచంటలో మాత్రమే గట్టి పోటీ ఉందని.. మిగిలిన ఆరు నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారన్న అంచనాలు నివేదికలు వచ్చేసాయి. ఇక ఎంపీగా శ్రీనివాస వర్మ విజయం ఏకపక్షంగా ఉంటుందని అందరూ అనుకున్నారు ఈరోజు జరిగిన కౌంటింగ్ లో శ్రీనివాస వ‌ర్మ ఏకంగా 2 ల‌క్ష‌ల పై చిలుకు భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఓ కౌన్సెల‌ర్ గా ప‌ని చేసి ఇప్పుడు నేరుగా పార్ల‌మెంటులో అడుగు పెట్ట‌బోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: