కాకినాడ ఎంపీ:కాకినాడ ఎంపీ: జ‌న‌సేన ఉద‌య్ స‌గ‌ర్వంగా పార్ల‌మెంటు కొట్టేశాడ్రా...!

RAMAKRISHNA S.S.
ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పార్లమెంటు స్థానాలలో అత్యంత ఆసక్తి రేపుతున్న స్థానాలలో కాకినాడ కూడా ఒకటి. ఈ కాకినాడ పార్లమెంటు నుంచి జనసేన అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి గత మూడు ఎన్నికలలోను మూడు పార్టీల తరఫున పోటీ చేసి ఓడిపోయిన దురదృష్టవంతుడు చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. ఇక కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తుండడంతో సహజంగానే కాకినాడ పార్లమెంటులో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం కాకినాడ నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న వంగా గీత ఈసారి పవన్ కళ్యాణ్ మీద పిఠాపురంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాకినాడ పార్లమెంటు పరిధిలో జనసేన ప్రభావం చాలా గట్టిగా కనిపిస్తోంది జనసేన, టీడీపీ, బీజేపి కూటమి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోనే కూటమి అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాలలో కాకినాడ పార్లమెంటు కూడా ఒకటి. వైసీపీ సైతం సామాజిక ఈక్వేషన్లు పాటిస్తూ కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక కాకినాడ సిటీ స్థానం మినహాయించి.. మిగిలిన ఆరు స్థానాలు కాపు సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించింది.

కాకినాడ పార్లమెంటు స్థానం కూడా ఇదే సామాజిక వర్గానికి కేటాయించింది. పార్లమెంటుకు అటు కూటమి తరపున.. ఇటు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు నేతలు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావటం విశేషం. మామూలుగా అయితే జనసేన ఇక్కడ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి సునీల్ గత మూడు ఎన్నికల్లోను ఓడిపోవడంతో ఆయన పట్ల సానుభూతి ఎక్కువగా ఉందన్న ప్రచారం జరిగింది. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక తునిలో మాత్రమే వైసీపీ గెలుస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. కాకినాడ సిటీలో వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని అనుకున్నారు.

ఇక పార్ల‌మెంటు ప‌రిధిలో పిఠాపురంతో పాటు కాకినాడ రూర‌ల్‌లో కూడా జ‌న‌సేనే పోటీ చేసింది. ఈరోజు జరిగిన కౌంటింగ్ లో ఇప్ప‌టికే 2 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో దూసుకు పోతున్నారు. ఏదేమైనా ప‌వ‌న్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన ఉద‌య్ ఇప్పుడు ఎంపీ అయిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: