శ్రీకాళహస్తి: 43 వేల ఓట్ల తేడాతో సుధీర్ రెడ్డి ఘన విజయం..!

Divya
ముక్కంటి పరమశివుని ఇలాకాలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. నిన్నటివరకు ఇక్కడ విజేత ఎవరన్నది ఆ శివయ్యకే తెలియాలి. ఇక్కడ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు అధికార,  విపక్ష పార్టీల అభ్యర్థులు సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ వార్ దుమ్ము రేపుతోంది. శ్రీకాళహస్తిలో రాజకీయం ఇప్పుడు అట్టుడుకుతోందనే చెప్పాలి..  ఎమ్మెల్యేగా ఐదేళ్ల అనుభవంతో ఒకరు.. ఐదు పర్యాయాలు నియోజకవర్గాన్ని ఏలిన కుటుంబం నుంచి వచ్చిన మరొకరు ఈ ఎన్నికలలో తలపడుతున్నారు. హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరులో అంతిమ విజయం ఎవరిది?  శ్రీకాళహస్తిలో శివయ్య చూపు ఎవరిపై ఉంది ?అసలు అక్కడ కనిపించబోయే సీన్ ఏంటి..?
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో తొట్టంబేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి , ఏర్పేడు మండలాలు ఉండగా.. ఇక్కడ రెడ్లదే రాజ్యం... బీసీ కేటగిరీలోకి వచ్చే పల్లెరెడ్లు అధికంగా ఉంటారు... సముద్రతీర ప్రాంతానికి దగ్గరగా ఉండే శ్రీకాళహస్తి ప్రాంతంలో పంట పొలాలు పచ్చదనంతో కలకలలాడుతుంటాయి. వ్యవసాయం ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తి..ఇక  రాజకీయ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు శ్రీకాళహస్తి కంచుకోట. గత పది ఎన్నికలలో ఆరుసార్లు టిడిపిని విజయం సాధించగా.. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ.. ఒకసారి స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ నుంచి గెలుపొందారు.. కానీ గత ఎన్నికల్లో వైసీపీ నేత ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తొలిసారి విజయం దక్కించుకొని వైసీపీ జెండా ఎగరవేశారు..
మరొకవైపు టిడిపి తరఫున gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ..మంత్రిగా కూడా పనిచేసిన ఈయన జిల్లాలో తిరుగులేని నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అలాంటి కుటుంబం నుంచి వచ్చిన gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోవడం బాధాకరమని చెప్పవచ్చు అయితే ఈసారి కూడా గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో ఓడిన gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎన్నికల్లో మరోసారి తలపడనున్నారు. అలా వైసిపి నుంచి మరోసారి బియ్యపు మధుసూదన్ రెడ్డి , టీడీపీ నుంచి సుధీర్ రెడ్డి సై అంటే సై అంటూ పోటీ పడుతున్నారు.. గత ఎన్నికల్లో తొలిసారి గెలిచినా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలో బాగా పట్టు పెంచుకున్నారు.. కోవిడ్ సమయంలో ఎన్నో సేవలు చేసి ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.. శ్రీకాళహస్తి వాసులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. ఆ అభిమానంతోనే ఆయన మళ్లీ గెలుస్తారని.. మరొక వైపు టిడిపి అభ్యర్థి కూడా కుటుంబ అండతో తానే అధికారంలోకి వస్తానని ధీమా మా వ్యక్తం చేస్తున్నారు మరి ఇంతటి పోరులో తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలలో ఎవరు గెలిచారు అనే విషయానికి వస్తే... బైపు మధుసూదన్ రెడ్డి పైన..43304 వేల ఓట్ల తేడాతో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలిచారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: