తాడేపల్లిగూడెం : దేవాదాయ మంత్రి ఓడ‌తాడ‌న్న సెంటిమెంట్ హిట్‌... ' జ‌న‌సేన బొలిశెట్టి ' సూప‌ర్ హిట్‌..!

RAMAKRISHNA S.S.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరు ఉన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో.. ఈసారి సరికొత్త పోరు జరిగింది. వ‌రుస‌ ఓటముల తర్వాత.. గత ఎన్నికలలో గెలిచిన కొట్టు సత్యనారాయణ అనూహ్యంగా మంత్రి అయ్యారు. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎన్నికల్లో ఓడిపోతారని.. వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ప్రచారం ఎన్నికలకు ముందు గట్టిగా జరిగింది. వైసీపీ నుంచి మంత్రిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పోటీ చేయగా.. పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి భారీగా ఓట్లు తెచ్చుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేశారు. అంతకుముందు బొలిశెట్టి తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇక్క‌డ బొలిశెట్టి బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ కూడా గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి జ‌న‌సేన వాయిస్ చాలా అంటే చాలా బ‌లంగా వినిపిస్తూ వ‌చ్చారు. నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీతో పాటు.. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ముందు నుంచి కాపు సామాజిక‌ వర్గ ప్రాబల్యం బాగా ఎక్కువ. గత కొన్ని దశాబ్దాల నుంచి ఏ పార్టీ తరపున అయినా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొత్తం మీద 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం తాడేపల్లిగూడెం కావటం విశేషం. ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ ప్రచార సరళి.. పోలింగ్ తర్వాత జనసేన నూటికి నూరు శాతం గెలిచే సీట్లలో ఒకటిగా తాడేపల్లిగూడెం నిలవబోతుందన్న అంచనాలు ముందే వినిపించాయి. చాలా సర్వేలలో సైతం చివరికి వైసీపీ సానుకూల సర్వేలలో కూడా ఇదే విషయం క్లియర్ గా స్పష్టం అయింది. ఇక ఈ రోజు కౌంటింగ్ లో జ‌న‌సేన బొలిశెట్టి ఏకంగా 62492 ఓట్ల బంప‌ర్ మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: