ఉంగుటూరు : జ‌న‌సేన ధ‌ర్మ‌రాజు రారాజుగా గెలిచాడు... గ్రేట్ విక్ట‌రీ..!

RAMAKRISHNA S.S.
ఉంగుటూరు అంటేనే నాటి సమైక్య రాష్ట్రము నుంచి.. నేడు రాష్ట్ర విభజన జరిగినా కూడా ఒక సెంటిమెంట్ బాగా ఉండేది. ఉంగుటూరులో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నానుడి ఉంది. అయితే ఈసారి ఉంగుటూరు రాజకీయం మారింది. మూడు పార్టీల కూటమి నేపథ్యంలో ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా పత్స‌మట్ల ధర్మరాజు పోటీ చేస్తే.. వైసీపీ నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు పోటీ చేశారు. 2014, 2019, 2024 ఎన్నికలలో వాసుబాబు వరుసగా పోటీ చేశారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు.. పుప్పాల వాసుబాబు మ‌ధ్యే పోటీ న‌డిచింది.

2014లో టీడీపీ గన్ని వీరాంజనేయులు చేతిలో ఓడిన వాసు బాబు.. 2019లో ఆయనపై విజయం సాధించారు. అయితే ఈ సారి జనసేన అభ్యర్థిని ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. ఉంగుటూరు నియోజకవర్గం.. కాపు సామాజిక వర్గానికి పెట్టని కోట. నియోజకవర్గంలో ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాలు ఉన్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతం కూడా కొంతవరకు విస్తరించి ఉంది.

జనసేన పోటీ చేసిన నియోజకవర్గ కావడంతో పాటు.. ఆ పార్టీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బరిలో నిలిచిన ఏకైక క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత ధర్మరాజు కావడంతో కమ్మ, కాపు రాజులతో పాటు పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు బలంగా పనిచేశారు. అయితే అనూహ్యంగా ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన వాసు బాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో.. కాస్త ఆసక్తికర పోరు జరిగిందనే చెప్పాలి. జనసేనకు కాస్త ఆధిక్యం ఉన్నా.. కాపులు వాసు బాబుకు ఓటేశారా అన్న సందేహాలు కూడా పోలింగ్ టైం లో వ్యక్తం అయ్యాయి.
 
అయితే ఫైన‌ల్ గా గెలుపు మాత్రం జ‌న‌సేన ధ‌ర్మ‌రాజునే వ‌రించింది. ఆయ‌న‌కు ఏకంగా 45000 ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. జ‌న‌సేన ఉంగుటూరు ఈ రేంజ్‌లో సౌండ్ చేసి గోదావ‌రిని కేక పెట్టించేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: