ఇంట్లో కుటుంబ సభ్యుడిలా తోడుంటా.. పవన్ స్పీచ్ కు ఫిదా అవ్వాల్సిందే!

Divya
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాజాగా ప్రెస్ మీట్ తో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేస్తూ విజయోత్సాహంతో.. ఇది గెలుపు కాదు అని తనపై పెట్టిన బాధ్యత అని.. మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా తోడుంటానని చెప్పుకొచ్చారు ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ గెలుపు చాలా బాధ్యత కూడుకుని ఉంది.. భీమవరం, గాజువాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు... ఈ రోజున నా ముందు ఇంతమంది ఉన్నారు కానీ ఆ రోజున నా పక్కన నేను నమ్ముకున్న పదిమంది తప్ప ఎవరూ లేరు. నేను ఓటమి చూసి భయపడను. ఓటమి నాకు బలం ఇస్తుంది. ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది.
దీనికంటే నేను ఒకటే నమ్మాను. చిన్నప్పుడు తిరుపతిలో చదువుకునేటప్పుడు..ధర్మం రక్షతి రక్షితః నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మాన్ని రక్షిస్తుంది.. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం నేను ఇది చదువుకున్నాను.. ఈరోజు నేను ధర్మం కోసం నిలబడ్డాను.. అందుకే మనస్ఫూర్తిగా కనిపించని ఆ పరాశక్తి , కనిపించని ఆ దేవుడు అందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.. మనస్ఫూర్తిగా మీ అందరికీ పిఠాపురం ప్రజలందరికీ , పిఠాపురం పురజనులకి,  పెద్దలకి,  కదం తొక్కిన జనసైనికులకి,  జనసేన నాయకులకు,  కదం తొక్కిన యువతకి తెలుగుదేశం చరణులకు తెలుగుదేశం నాయకులు వర్మ గారికి వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను..

మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించలేదు.. ఐదు కోట్ల మంది ప్రజలని మీరు గెలిపించారు.మీరు గుండెల్లో పెట్టుకొని నాకు పరువు ఇచ్చారు..  ఓడిపోతేనే ఇంత బాగా నిలబడ్డవాడిని.. ఇంత గెలుపు ఇచ్చారు.. ఆకాశమంత ఉత్సాహం ఇచ్చారు.. ఇప్పుడు గుండెల్లో పెట్టుకుంటాను.. నిలబెడతాం.. నిర్మాణాత్మకంగా పనిచేస్తాం..  మీ కష్టాలలో.. మీ కంట్లో ఒకటిలా నేను ఉంటానని మాట ఇస్తున్నాను.. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా తోడుంటాను అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: