గుంతకల్లు: వైసీపీ నుంచి వచ్చి టిడిపి తో విజయాన్ని అందుకున్న గుమ్మనూరు జయరామ్..!

Divya
ఈసారి గుంతకల్లు నియోజవర్గంలో ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి.. మే 13వ తేదీన ఎన్నికలు ముగిసినప్పటికీ స్థానికంగా ఓటర్ల మధ్య అసంతృప్తి ఛాయలు నెలకొన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా టిడిపిలో టికెట్టు ఆశించి భంగపడ్డ జితేంద్ర గౌడ్ వర్గీయులు అసహనం తెలియజేస్తున్నరు. ఆలూరి నుంచీ ఎమ్మెల్యేగా వైసీపీ టికెట్ ఆశించి.. భంగపడ్డ మంత్రి గుమ్మనూరు జయరాం.. టిడిపిలోకి చేరి గుంతకల్లు టికెట్టు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి టిడిపి తరఫున టికెట్ వస్తుందని జితేంద్ర గౌడ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా ... టికెట్ మాత్రం దక్కలేదు దీంతో టిడిపి ఓటర్లు కూడా చాలా వరకు గుమ్మనూరు జయరాం వెైపు మొగ్గు చూపలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక మరోవైపు వైసీపీ పార్టీ తరఫున వై వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగారు. వాస్తవానికి 2014లోనే టిడిపి అభ్యర్థి ఆర్ జితేంద్ర గౌడ్ చేతిలో కేవలం ఐదువేల ఓట్ల తేడాతో ఓడిపోయిన ఈయన.. మళ్ళీ 2019లో..  ఏకంగా  50వేల ఓట్ల  మెజారిటీతో గెలుపొందారు ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే 2014లో కేవలం 5000 ఓట్ల తేడాతో జితేంద్ర గౌడ్ చేతిలో ఓడిపోయిన వై వెంకట్రాంరెడ్డి మళ్లీ 2019లో పుంజుకొని ఏకంగా 50వేల ఓట్ల తేడాతో జితేంద్ర గౌడ్ ను ఓడించడం ఆశ్చర్యకరం ఇక దాంతో గుంతకల్లు నియోజకవర్గం లో వై వెంకట్రామిరెడ్డికి పట్టు బాగా పెరిగింది..

అయినా సరే హోరాహోరీగా సాగుతున్న పోరులో.. చివరిగా ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాలలో.. గుమ్మనూరు జయరామ్.. వెంకట్రామిరెడ్డి పైన 6826 ఓట్ల తేడాతో గెలవడం జరిగింది.. అయితే గతంలో వైసిపి పార్టీ నుంచి వచ్చిన గుమ్మనూరు జయరామ్.. సీటు ఇస్తామన్నా కూడా వద్దని చెప్పి మరి టిడిపి పార్టీలోకి చేరి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఈనెల తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. గుంతకల్లు టిడిపి నేతలు జనసేన కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: