ముమ్మ‌డివ‌రం : టీడీపీ రాజు గారి రీ సౌండ్ అదుర్స్‌... స‌ముద్రం ఒMడ్డున మెజార్టీ చించి ప‌డేశారు..

RAMAKRISHNA S.S.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రం ఒడ్డున విస్తరించి ఉన్న నియోజకవర్గం ముమ్మిడివరం. ఒకప్పుడు ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న ముమ్మిడివరం 2008 నియోజకవర్గాల పునర్విభజనలో జనరల్ గా మారింది. నియోజకవర్గంలో కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐపోలవరం మండలాలతో పాటు కాకినాడ జిల్లాలో ఉన్న తాళ్ళరేవు మండలాలు విస్తరించి ఉన్నాయి. మరోసారి నియోజకవర్గంలో పాత ప్రత్య‌ర్ధులే పోటీపడుతున్నారు. గత ఎన్నికలలో టీడీపీ సీటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దాట్ల సుబ్బరాజును వైసీపీ నుంచి పోటీ చేసిన సతీష్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఓడించారు. ఈ ఎన్నికలలో మరోసారి వీరిద్దరే పోటీ పడుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో బీసీలలో శెట్టిబలిజ సామాజిక వర్గంతో పాటు.. మత్స్యకార సామాజిక వర్గం, ఇటు ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంటారు.

ఇక నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి పైన చెప్పుకున్న మూడు సామాజిక వర్గాల స్థాయిలో బలమైన ఓటు బ్యాంకు లేకపోయినా.. ఆ సామాజిక వర్గానికి చెందిన దాట్ల సుబ్బరాజు 2014 ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. పొన్నాడ సతీష్ కుమార్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత.. వ్యక్తిగతంగా సుబ్బరాజుకు మంచి పేరు ఉంది. ఇటు సతీష్ కుమార్ కూడా రెండుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో ముమ్మిడివరం లోను ఆ ప్రభావం గట్టిగా కనిపించింది.

ఎన్నికలకు ముందు ప్రచార సరళి పోలింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఇక్కడ ఖచ్చితంగా కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఘనవిజయం సాధిస్తారని అంచనాలు విన‌ప‌డ్డాయి ఈరోజు జరిగిన కౌంటింగ్లో 37935 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్ట‌బోతున్నారు. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం నుంచి రెండో సారి గెలిచిన దాట్ల సుబ్బ రాజు ఈ సారి క్ష‌త్రియ కోటా లో మంత్రి ప‌ద‌వి రేసులో ఉంటార‌న్న అంచ‌నాలు అయితే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: