రంప‌చోడ‌వ‌రం : అంగ‌న్వాడి టీచ‌ర్ టు అసెంబ్లీ... శీరీషా సూప‌ర్ నీది సూప‌ర్ విక్ట‌రీ..!

RAMAKRISHNA S.S.
ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ లో ఉన్న రంపచోడవరం.. ఎస్టీ నియోజకవర్గంలో ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇది అరకు లోక్ స‌భ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వైశాల్యపరంగా అతిపెద్ద నియోజకవర్గంగా రంపచోడవరం ఉంది. తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిసిన నాలుగు పోలవరం ముంపు మండలాలు కూడా రంపచోడవరం నియోజకవర్గంలో అంతర్భాగం అయ్యాయి. మొత్తం 11 మండలాలతో రంపచోడవరం నియోజకవర్గ విస్తరించి ఉంది.

మారేడుమిల్లి, దేవీపట్నం, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, కూనవరం, చింతూరు, వర, రామచంద్రపురం, నెల్లిపాక మండలాలు ఈ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్నాయి. 2014, 2019 రెండు ఎన్నికలలోను ఇక్కడ నుంచి వైసీపీ విజయం సాధించింది. రంపచోడవరం నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉంటుంది. ఇక్కడ వైసీపీ నుంచి ఎవరు గెలిచిన కాంట్రవర్సీలో చిక్కుకున్న ఎమ్మెల్సీ అనంత బాబు హవా నడిపిస్తూ ఉంటారు. ఇక వైసీపీ నుంచి సెట్టింగ్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికి మరోసారి అవకాశం దక్కింది. అనంత బాబు ఆమె గెలుపు కోసం అన్నీ తానై ప‌ని చేశారు.

టీడీపీ నుంచి రాజమ్మంగి మండలానికి చెందిన మిర్యాల శిరీషకు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థికి ఏకంగా 40 + వేల ఓట్ల పైచిలుకు మెజార్టీ వచ్చింది. ఈసారి జనసేన, టీడీపీ పొత్తు నేపథ్యంలో ఏజెన్సీలో ఉన్న కాపులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం గట్టిగా కసితో పని చేశారు. ఎన్నికల ప్రచారానికి ముందు పోలింగ్ తర్వాత అంచనాలను బట్టి చూస్తే రంపచోడవరంలో గత ఎన్నికల కంటే వైసీపీ మెజార్టీ తగ్గిన కచ్చితంగా ఫ్యాను ప్రభంజనం గట్టిగా వీచిందన్న చర్చలు వినిపించాయి ఈరోజు జరిగిన కౌంటింగ్ లో 9139 ఓట్ల మెజార్టీతో వైసీపీ కంచుకోట‌ను టీడీపీ మిరియాల శిరీష బ‌ద్ద‌లు కొట్టి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: