రామచంద్రపురం : సుభాష్ కోన‌సీమ‌నే కాదు అసెంబ్లీని కూడా ఊపేస్తాడా..!

RAMAKRISHNA S.S.
కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గత మూడున్నర దశాబ్దాలుగా రెండు బలమైన సామాజిక వర్గాల కురుక్షేత్ర సంగ్రామానికి వేదికగా ఉంటూ వస్తుంది. రామచంద్రపురం నియోజకవర్గ పేరు చెబితేనే పార్టీలు ఏవి అయినా.. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు మధ్య గత మూడు దశాబ్దాలుగా పోరు కొనసాగుతోంది. వీరిలో పిల్లి బోస్.. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేతకాగా.. తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అయితే గత ఎన్నికల్లో పిల్లి బోస్, తోట త్రిమూర్తుల పోరుకు బ్రేక్ పడింది. పిల్లి బోస్‌ను మండపేటకు బదిలీ చేసిన జగన్.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు రామచంద్రపురం సీటు ఇచ్చారు.

ఆ ఎన్నికల్లో వేణు విజయం సాధించారు. ఆ తర్వాత పిల్లి బోస్, చెల్లుబోయిన వేణు, తోట త్రిమూర్తులు ముగ్గురు వైసీపీ గూటికి చేరినట్లు అయింది. నియోజకవర్గంలో బలంగా ఉన్న తోట త్రిమూర్తులు వర్గం సిల్లి బోస్ వర్గం తో పాటు.. కాస్తో కూస్తో పట్టు ఉన్న వేణు వర్గాలు ఈ ఎన్నికలలో కలిసికట్టుగా వైసీపీ నుంచి పోటీ చేసిన‌.. పిల్లి బోస్ కొడుకు.. పిలి సూర్య ప్రకాష్‌ కు సపోర్ట్ చేశాయి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి అమలాపురం కు చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గం.. యంగ్ డైనమిక్ లీడర్ వాసంశెట్టి సుభాష్ కు సీటు ఇచ్చింది. ఇద్దరు యువ నాయకులే.. బీసీల్లో బల‌మైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు.

నియోజకవర్గంలో రామచంద్రపురం మున్సిపాలిటీ తో పాటు రామచంద్రపురం, కే గంగవరం, కాజులూరు మండలాలు విస్తరించి ఉన్నాయి. రామచంద్రపురం ముందు నుంచి.. కాపులు వ‌ర్సెస్ శెట్టిబలిజ‌ల‌ రాజకీయ అధిపత్యానికి వేదికగా ఉంటూ వచ్చింది. ఎన్నికల్లో ఇద్దరు యువనేతలు పరస్పరం హోరాహోరీగా తెలపడ్డారు. ఇద్దరు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఎవరికి సపోర్ట్ చేశారు అన్నదే ముందు నుంచి సస్పెన్స్ గా ఉంది. తోట త్రిమూర్తులు సపోర్ట్ తో కాపులు తమకే ఓట్లు వేశారని వైసీపీ భావిస్తే.. జనసేన పొత్తుతో తమకే ఓట్లు వేశారని టీడీపీ భావించింది.

అయితే ఈ రోజు కౌంటింగ్‌లో ఈ కురుక్షేత్ర సంగ్రామాన్ని త‌ల‌పించిన పోరులో 25 వేల ఓట్ల మంచి మెజార్టీతో సుభాష్ విజ‌యం సాధించి ఫ‌స్ట్ టైం అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సుభాష్ లాంటి యంగ్ డైన‌మిక్ లీడ‌ర్ టీడీపీకి దొర‌క‌డంతో పాటు అసెంబ్లీలో మంచి వాయిస్ వినిపిస్తార‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: