కుప్పంలో బాబుకు తిరుగులేదుగా.. మెజారిటీ లెక్కలు చూస్తే షాకవ్వాల్సిందే!

Reddy P Rajasekhar
ఏపీ ఎన్నికల్లో అటు వైసీపీ, ఇటు టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం కుప్పం కాగా కుప్పంలో గెలుపు కోసం ఈ రెండు పార్టీలు ఎంత కష్టపడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుప్పం నుంచి టీడీపీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు పోటీ చేయగా వైసీపీ నుంచి కేజే భరత్ పోటీ చేశారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని కుప్పం విషయంలో వైసీపీ నేతలు నమ్మకం వ్యక్తం చేశారు.
 
మరోవైపు చంద్రబాబు మాత్రం కుప్పం అంటే టీడీపీ కంచుకోట అని ఈ నియోజకవర్గంలో తనకు తిరుగులేదని భావించడం జరిగింది. కుప్పంలో చంద్రబాబు నాయుడు మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని ప్రచారం జరగగా ఆ ప్రచారమే నిజం కావడం గమనార్హం. చంద్రబాబు నాయుడు మరోమారు కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కుప్పంలో తిరుగులేదని ఆయన ప్రూవ్ చేసుకున్నారు.
 
48,184 ఓట్ల మెజారిటీతో కుప్పంలో చంద్రబాబు విజయం సాధించారు. ఏపీ సీఎంగా మరికొన్ని రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు భారీ మెజార్టీతో విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వైసీపీ అభ్యర్థి భరత్ ను చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడించారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో సైతం కుప్పంలో బాబుకు సునాయాసంగా విజయం దక్కింది.
 
చంద్రబాబును ఓడిస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు ఈ ఎన్నికల్లో ఓటమిపాలు కావడం కొసమెరుపు. చంద్రబాబును ఓడించడం అంటే సులువైన విషయం కాదని చంద్రబాబుకు ఆయనే సాటి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాబు భారీ మెజార్టీతో ఆయన గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డ కుప్పం కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది. కుప్పంలో భవిష్యత్తులో చంద్రబాబు పోటీ చేసినా ఆయనదే విజయమని ఈ నియోజకవర్గంపై వైసీపీ ఆశలు వదిలేసుకుంటే మంచిదని ఈ నియోజకవర్గం ఎప్పటికీ టీడీపీకి కంచుకోట అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: