పత్తికొండ టఫ్ ఫైట్ లో ఆ అభ్యర్థిదే విజయం.. ఆ పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్టే!

Reddy P Rajasekhar
కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం విషయంలో ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒకింత ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా కూటమి అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఓటమిపాలైన కేఈ శ్యాంబాబు పోటీ చేయడం జరిగింది. ఒకప్పుడు పత్తికొండ టీడీపీ కంచుకోట అయినప్పటికీ గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది.
 
ఎన్నికల పోలింగ్ పూర్తైన తర్వాత అటు శ్రీదేవి ఇటు శ్యాంబాబు తమ పార్టీదే విజయం అని తేల్చి చెప్పడం జరిగింది. వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, స్థానికంగా తాను చేసిన అభివృద్ధి తనుకు ప్లస్ అవుతాయని శ్రీదేవి భావించగా కేఈ శ్యాంబాబు తనకు ఉన్న పొలిటికల్ బ్యాగ్రౌండ్, గత ఎన్నికల్లో ఓడియాననే సానుభూతి, కూటమి ప్రకటించిన హామీలు తనకు ప్లస్ అవుతాయని ఫీలయ్యారు.
 
పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులపై విమర్శలు ఉన్నా కేఈ శ్యాంబాబుకే ఎన్నికల్లో విజయం దక్కింది. 13600 ఓట్ల మెజార్టీతో పత్తికొండ ఎమ్మెల్యేగా కేఈ శ్యాంబాబు కంగాటి శ్రీదేవిపై విజయం సాధించారు. కేఈ శ్యాంబాబు విజయం సాధిస్తారని ముందునుంచి వినిపించగా ఆ వార్తలే ఎట్టకేలకు నిజమయ్యాయి. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న పత్తికొండలో ఆ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
గత ఐదేళ్లలో కంగాటి శ్రీదేవి పాలనపై ఒకింత విమర్శలు రాగా కేఈ శ్యాంబాబు మాత్రం విమర్శలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పాలన సాగించేలా నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. పత్తికొండను అభివృద్ధి పథంలో నడిస్తానని శ్యాంబాబు చెప్పినట్టు సమాచారం అందుతోంది. పత్తికొండలో సత్తా చాటిన శ్యాంబాబు అభివృద్ధితో భవిష్యత్తులో కూడా తానే ఎమ్మెల్యేగా కొనసాగుతానని నమ్మకం వ్యక్తం చేసినట్టు సమాచారం. కేఈ శ్యాంబాబు విజయంతో పత్తికొండలో టీడీపీకి ఇక ఎదురులేదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: