రాయదుర్గం: భారీ మెజారిటీతో గెలుపొందిన కాల్వ శ్రీనివాసులు..!

Divya

అనంతపురం సెగ్మెంట్లో ప్రధానంగా వినిపించే మరో నియోజకవర్గం రాయదుర్గం..  ఇందులో ప్రత్యేకించి 2019 ఎన్నికలతో పోల్చుకుంటే 2024 ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.. ఇక్కడ కూటమిగా ఏర్పడిన టిడిపి , జనసేన,  బిజెపి రాయదుర్గంలో ఎలాగైనా సరే అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుండగా .. వైసిపి తామే అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇక అందులో భాగంగానే 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కాదని  మెట్టు గోవింద్ రెడ్డి పోటీ చేస్తుండగా.. టిడిపి తరఫున కాల్వ శ్రీనివాసులు బరిలోకి దిగారు.
2019 ఎన్నికల్లో కూడా టిడిపి తరఫున బరిలోకి దిగిన కాల్వ శ్రీనివాసులు.. ఇప్పుడు 2024 లో కూడా మరొకసారి బరిలోకి దిగారు. ఎవరికి వారు పోటా పోటీగా ప్రచారాలు నిర్వహించారు. ఇక ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్ వివరాలు కూడా ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచాయి. నిజానికి ఎగ్జిట్ పోల్ వివరాలలో చాలా సర్వేలు వైసిపి గెలుస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే ప్రత్యేకించి రాయదుర్గం నియోజకవర్గం లో కూడా వైసిపి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెప్పినప్పటికీ.. రాయదుర్గం వైసిపి నేతలలో ఆ ఆనందం కనిపించలేదమే వార్తలు వినిపిస్తున్నాయి మరొకవైపు కూటమిలో తప్పకుండా తామే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.. ఇలా ఎవరికి వారు గెలుస్తామా లేదా అనే సందిగ్ధత ఉన్న నేపథ్యంలో జూన్ 4వ తేదీన ఎన్నికలు విడుదలవుతున్న విషయం తెలిసిందే..

ఇక ఇంతటి హోరాహోరీ పోటీలో ఎవరు గెలిచారు అనే విషయానికి వస్తే ఆఖరి కౌంటింగ్లో.. మెట్ట గోవిందరెడ్డి పైన కాల్వ శ్రీనివాసులు 41659 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.. దీంతో ఈయనకు రాప్తాడులో భారీ విజయం చేకూరిందని టిడిపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. ముఖ్యంగా వైసిపి ప్రభుత్వం పైన ప్రజలకు వ్యతిరేకత ఉందని అందుకే టిడిపి పార్టీని ఆదరించాలని కూడా తెలియజేస్తున్నారు. వైసీపీ పార్టీకి ఇది చాలా ఘోరమైన ఓటమి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: