విజ‌య‌వాడ వెస్ట్ : సుజ‌నా చౌద‌రి సెన్షేష‌న‌ల్ రికార్డ్‌... ఈ గెలుపు చాలా స్పెష‌ల్‌

RAMAKRISHNA S.S.
ముందు నుంచి అత్యంత ఆసక్తి రేపిన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో.. కూటమి నుంచి ముందు జనసేన పోటీ చేస్తుందని అనుకున్నారు. అయితే చివరిలో బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సృజనా చౌదరి పోటీ చేశారు. గత ఎన్నికలలో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి బదిలీ చేసిన వైసీపీ అధినేత జగన్.. మాజీ కార్పొరేటర్ విద్యాసంస్థల అధినేత షేక్ ఆసిఫ్ ను రంగంలోకి దింపారు. వాస్తవానికి సుజనా చౌదరితో పోలిస్తే షేక్ ఆసిఫ్ మామూలు సాధారణ కార్యకర్త అని చెప్పాలి. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సామాజిక సమీకరణాల పరంగా వైసీపీకి బాగా అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. వైసీపీ గత రెండు ఎన్నికలలోను ఇక్కడ నుంచి విజయం సాధించింది. ఇక్కడ తెలుగుదేశం పోటీ చేస్తే ఒకలా ఉండేది. . అయితే ఇప్పుడు ఇక్క‌డ క‌మ‌లం గుర్తుతో సుజ‌నా చౌద‌రి పోటీలో ఉన్నారు.

అందులోను అత్యంత సంక్లిష్టంగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. అందులోనూ మైనార్టీలు ఎక్కువగా ఉన్నచోట ... మైనార్టీలు గ‌ట్టిగా వ్య‌తిరేకించే బిజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేయటం అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే సుజనా చౌదరి ముస్లింలు మాత్రమే కాకుండా.. ఇతర బీసీ సామాజిక వర్గాలు, ఆర్య వైశ్య, మార్వాడి, ఉత్తర భారతీయులతో పాటు.. జైన సామాజిక వర్గానికి చెందిన వారిని ఏకతాటి మీదకు తీసుకురావడంతో పాటు.. ఆర్థికంగా కోట్లాది రూపాయల ఖర్చు చేశారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. కచ్చితంగా వైసీపీ గెలుస్తుందన్న చోట హోరాహోరి పోరు చేసి.. నువ్వా నేనా అనే స్థాయికి తీసుకువచ్చారు. దీంతో ప్రచారంతో పాటు పోలింగ్ ముగిశాక ఎవరు గెలుస్తారు ? అన్నది.. ఎవరు సరిగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.

అయితే ఈ రోజు జ‌రిగిన కౌంటింగ్‌లో అనూహ్యంగా సుజ‌నా అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ ఏకంగా 46, 540 ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. అస‌లు పార్టీకి ప‌ట్టు లేని చోట అందులోనూ మైనార్టీలు ఎక్కువుగా ఉన్న చోట బీజేపీ నుంచి పోటీ చేసి ఈ రేంజ్‌లో విజ‌యం సాధించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇక సుజ‌నా బీజేపీ కోటాలో మంత్రి ప‌ద‌వి పై గురి పెట్టార‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: