చక్కర నినాదం పట్టి.. ధర్మపురి హిట్టు కొట్టాడు?

praveen
తెలంగాణ రాష్ట్రం లో పట్టు సాధించాలని ఎన్నో రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది బిజెపి. క్రమ క్రమంగా తమ సీట్ల సంఖ్యను అంతకంతకు పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పోటీగా సీట్లు గెలుచుకోవాలని పట్టుదల తో ఉంది. అనుకున్నట్లు గానే ఏకంగా కీలకమైన స్థానాల లో విజయం సాధించింది. అది కూడా భారీ మెజారిటీ తో బిజెపి అభ్యర్థులు విజయ డంకా మోగించారు అని చెప్పాలి.

 ఇలా ఒక వైపు సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడమే కాదు.. ఇంకోవైపు ఇక బిఆర్ఎస్ పార్టీ కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో సైతం భారీ మెజారిటీతో విజయం సాధిస్తూ వచ్చింది బిజెపి. ఈ క్రమంలోనే బిజెపి పార్టీ సిట్టింగ్ స్థానంగా కొనసాగుతున్న నిజాంబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా మరోసారి ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. సెట్టింగ్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ మరోసారి కమలం పార్టీ తరఫున బరిలోకి నిలిచారు. అయితే అరవింద్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్.. కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి బరిలో నిలిచారు  .

 ఎవరికివారు హామీల వర్షం కురిపిస్తూ ఇక ప్రచారంలో దూసుకుపోయారు. అయితే ఇప్పటికే పసుపు బోర్డు హామీ ఇచ్చి నెరవేర్చడంలో దాదాపుగా సక్సెస్ అయిన ధర్మపురి అరవింద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని హామీ ఇవ్వడంతో రైతులందరూ మరోసారి ధర్మపురి అరవింద్ వైపే నిలిచారు. ఈ క్రమంలోనే మొదటి నుంచి లీడింగ్ లో కొనసాగుతూ వచ్చిన ధర్మపురి అరవింద్ 1,22,71 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో బీజేపీ సిట్టింగ్ స్థానమైన నిజాంబాద్ మరోసారి పదిలంగానే ఉంది అని చెప్పాలి. ధర్మపురి అరవింద్ దూకుడైన స్వభావం.. స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచార నిర్వహించడం బిజెపికి ఎంతగానో కలిసి వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: