1999 తర్వాత తొలిసారి మైదుకూరులో విజయకేతనం ఎగరవేసిన టీడీపీ..??

Suma Kallamadi
వైఎస్ఆర్ కడప జిల్లాలోని కీలక నియోజకవర్గమైన మైదుకూరు నియోజకవర్గంలో ఈసారివైసీపీ నుంచి ఎస్‌. రఘురామి రెడ్డి, టీడీపీ నుంచి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పోటీ చేశారు. గతంలో కాంగ్రెస్‌కి ఈ నియోజకవర్గం కంచుకోట లాగా ఉండేది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి డీ.ఎల్ రవీంద్రారెడ్డి ఆరుసార్లు గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి బ్యాక్ టు బ్యాక్ గెలిచారు. ఆయనకు ఈ నియోజకవర్గంలో మంచి పాజిటివ్ ఇమేజ్ ఉంది. వైసీపీ సంక్షేమ పథకాలు కూడా బాగా కలిసి వచ్చాయి. కానీ ఈసారి వైసీపీ సునామీలో ఆయన కొట్టుకుపోయారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య209,555
* 2024 ఎలక్షన్ రిజల్ట్
టీడీపీ నేత పుట్టా సుధాకర్‌ 96,181 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి 75,231 ఓట్లతో సరిపెట్టుకున్నారు. దాంతో పుట్టా సుధాకర్‌ 20,950 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని సాధించారు. ఇంతకుముందు ఇక్కడి నుంచి టీడీపీ చివరిసారిగా 1999 ఎన్నికల్లో గెలిచింది. పుట్టా సుధాకర్‌ యాదవ్ పోయినసారి 29,344 వేల ఓట్ల తేడాతో రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో కూడా సుమారు 11 వేల ఓట్ల తేడాతో అతని చేతిలోనే ఓడారు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆయన ప్రజలతో బాగా మమేకమయ్యారు. గ్రౌండ్ లెవెల్‌లో తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ గ్యారెంటీలను బాగా ప్రచారం చేశారు. ఈ నియోజకవర్గంలో 16% యాదవ సామాజిక వర్గ ప్రజల ఓట్లు ఉన్నాయి. అవి తమకే పడతాయని ఈయన ఆశలు పెట్టుకున్నారు. అయితే వరుసగా రెండుసార్లు ఓడగొట్టామని, పాపం ఈసారి ఆయనకే ఓట్లు వేద్దాంలే అనే ఒక సానుభూతి ఫ్యాక్టరీ క్రియేట్ అయినట్లు కూడా టాక్ నడిచింది. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా నిజమయ్యాయి ఆయనకు అన్నీ ఈసారి కలిసి వచ్చాయి. దాంతో మైదుకూరులో పాతికేళ్ల తర్వాత మళ్లీ టీడీపీ జెండాని ఎగరవేయగలిగారు.
మైదుకూరు నియోజకవర్గంలో ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం, మైదుకూరు మండలాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: