ఆలియా భర్త ఆస్తుల లిస్టు.. గట్టిగానే వెనకేసాడుగా..!
ప్రజెంట్ రణబీర్ ఆస్తుల విలువ రూ.345 కోట్లతో ఉన్నట్టు సమాచారం. ఆయన వార్షిక ఆదాయం 30 కోట్ల కంటే ఎక్కువగానే ఉంది. ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారు. గత ఎడాది విడుదలైన యనిమల్ కి రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా రణబీర్ కు క్రీడలు అంటే కూడా ఎంతో ఇష్టం అందుకే ఇండియన్ సూపర్ లీగ్ లో ముంబై సిటీ ఎఫ్ సి జట్టుకు ఆయన యజమాని. అతనికి 35 షేర్లు ఉన్నాయి. ఫుట్‌బాల్‌పై కూడా రణబీర్‌కు ఆసక్తి ఉంది. అందుకే తన కూతురు పేరును ఫుట్ బాల్ షర్ట్ పై తెలిపాడు. రణబీర్ కపూర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ఉంది. అదే సావన్ కంపెనీ. 2014 నుంచి యజమానిగా ఉన్నాడు.
అలాగే టేక్ పరిశ్రమంలో కూడా ఆయనకుపెట్టుబడులు ఉన్నాయి. పూనకు చెందిన డ్రోన్ స్టార్టప్ కంపెనీలో 20 లక్షలు పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా చాలా రంగాల్లో ఆయన పెట్టుబడులు పెట్టాడు. ముంబైలోని బాంద్రాలో నాలుగు నాలుగు విలాసవంతమైన ఇల్లులు కూడా ఉన్నాయి. పూణేలో 13కోట్ల విలువైన ఫ్లాట్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ హీరో రామాయణం సినిమాతో పాటు లవ్ అండ్ వార్ మూవీలో నటిస్తున్నాడు. అలాగే ఆలయతో వివాహం తర్వాత రణబీర్ ఆస్తులు విలువ మరింత పెరిగింది.