మినీ ఇండియా రాజన్నదే.. పాపం రేవంత్ సీఎంగా ఉన్నా?

praveen
దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా కొనసాగుతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో గెలుపు ప్రతి పార్టీకి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. అటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మల్కాజ్గిరిలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనే విషయంపై ఉత్కంఠ ఉంటుంది. ప్రధాన పార్టీలన్నీ కూడా గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయ్.

 అయితే ఈసారి కూడా మునుపెన్నడూ లేని విధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది అని చెప్పాలి. ఇక్కడ బిజెపి నుంచి ఈటెల రాజేందర్ బిఆర్ఎస్ నుంచి రాగిరి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీలో దిగారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం కావడం.. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా ఉండడంతో ఇక అధికార హస్తం పార్టీ మల్కాజ్గిరి లో విజయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది.

 కానీ జనం గుండెల్లో ఈటెల రాజేందర్ కు ఉన్న పేరు ముందు అటు అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫల ప్రయత్నాలు గానే మారిపోయాయి. ఎందుకంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో పరిధిలోకి  తక్కువ సమయంలోనే ఓటర్ల మనసులో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు ఈటెల. ఇక మాస్ లీడర్ గా ఉన్న ఈటెల చెప్పింది చేస్తారు. చేసేదే చెబుతారు అనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. కేంద్రంలో ఎలాగో బిజెపి అధికారంలోకి వస్తుంది కాబట్టి.. ఈటెలకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే మొదటి రౌండ్ నుంచే ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చిన ఈటెల రాజేందర్ 3.5 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో మల్కాజ్గిరిలో ఘనవిజయాన్ని అందుకున్నారు. ఇక్కడ రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మూడో స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: