శింగనమల: టిడిపి పార్టీదే హవా.. టిప్పర్ డ్రైవర్ ఓటమి..!

Divya
శింగనమల.. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే 2024 ఎన్నికలు ఆద్యంతం ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే..  ముఖ్యంగా 2019లో వైసీపీ తరఫున జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యే బరిలో దిగగా.. అటు టిడిపి నుంచి బండారు శ్రావణి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు.. అయితే ఊహించని పరిణామంతో 2014 ఎన్నికలలో ఓడిపోయిన జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర చేస్తూ ప్రజలలో మమేకమై.. ప్రజల మన్ననలు పొంది 2019లో ఏకంగా 45 వేల ఓట్ల అత్యధిక మెజారిటీతో అఖండ విజయం సాధించి.. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిని ఓడించింది.. అయితే ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కసితో పట్టుదలతో బండారు శ్రావణి భారీ ప్రయత్నాలు చేసింది..
ఆ ప్రయత్నంలో భాగంగానే ఈసారి కూడా టిడిపి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు బండారు శ్రావణి. మరొకవైపు వైసీపీ నుంచి టిప్పర్ డ్రైవర్గా పనిచేసిన ఒక సామాన్య వ్యక్తి వీరాంజనేయులు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగారు.. అయితే ఇక్కడ బండారు శ్రావణి పై ప్రజలలో సానుభూతి ఎక్కువగా ఉంది.. పైగా శింగనమల నియోజకవర్గం లో  గార్లదిన్నె, శింగనమల,పుట్లూరు, యల్లనూరు,నార్పల, BK సముద్రం ఇలా మొత్తం ఆరు మండలాలు ఉండగా.. ప్రత్యేకంచి బికే సముద్రం , గార్లదిన్నె  ప్రాంతాలలో ఓటర్లు ఎక్కువ..పైగా టిడిపికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. ఈ నేపథ్యంలోని ఈమె ఈసారి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు కూడా వినిపించాయి.


మరి ఫైనల్ గా కౌంటింగ్ లో.. బండారు శ్రావణి వీరాంజనేయులుపై..8159 కోట్ల తేడాతో గెలుపొందారు.. గతంలో ఓడిపోయిన బండారు శ్రావణి సెంటిమెంట్తో ఈసారి గెలుపొందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా సింగనమల గెలిచిన చోట అధికారం కూడా అదే పార్టీ దక్కించుకుంటుంది అనే అంశాన్ని కూడా మరొకసారి టిడిపి పార్టీ బ్రేక్ చేసిందని తెలుస్తోంది. ఏది ఏమైనా రాయలసీమలో టిడిపి పార్టీ హవ ఒక ప్రభంజనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

WIN

సంబంధిత వార్తలు: