ఏలూరు : వైసీపీ ఆళ్ల నానిని ఇంటికి పంపేసిన టీడీపీ బ‌డేటి చంటి... ఫ‌స్ట్ టైం అసెంబ్లీకి

RAMAKRISHNA S.S.
ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరు రాజకీయం.. ఈసారి ముందు నుంచి కాస్త చప్పగానే సాగిందని చెప్పాలి. అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని పోటీ చేయగా.. టీడీపీ నుంచి తొలిసారిగా బడేటి చంటి పోటీ చేశారు. 2009, 2014, 2019 ఎన్నికలలో ఇక్కడ పరస్పరం తలపడ్డ ఆళ్ళ నాని... మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మధ్య ఆసక్తికర పోరు సాగేది. అయితే గత ఎన్నికలలో ఓటమి తర్వాత బుజ్జి హఠాన్మరణంతో ఈ ఎన్నికలలో ఆయన సోదరుడు బ‌డేటి చంటి పోటీ చేశారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి మూడేళ్లలో మంత్రిగాను, ఉపముఖ్యమంత్రిగాను ఉన్నారు.

ఆళ్ళ నాని ఎన్నికల ప్రచారం పోలింగ్ సర‌ళ‌ని బట్టి చూస్తే ఆళ్ల నానికి ఈసారి నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ నేత‌ బడేటి చంటి.. కచ్చితంగా గెలుస్తారనే చ‌ర్చ బాగా న‌డిచింది. వ్యక్తిగతంగా సౌమ్యుడు కావడం.. ఇటు జిల్లా కేంద్రం కావడంతో.. ఉద్యోగుల ఓట్లు, అభివృద్ధి పరంగా పోల్చి చూసిన ఆళ్ళ నాని మంత్రిగా పనిచేసే కూడా అంచనాలు అందుకోలేకపోవటం.. ఆయనకు మైనస్ గా మారింది.

ఎన్నికలకు ముందు నుంచి మెజార్టీ సర్వేలతో పాటు పలు నివేదికలు, రాజకీయ విశ్లేషకులు అంచనాల ప్రకారం కచ్చితంగా ఏలూరు అసెంబ్లీ సీటు తెలుగుదేశం గెలుచుకుంటుందని చెబుతూ వచ్చారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏలూరు కార్పోరేషన్ తో పాటు ఏలూరు మండలంలో ఎనిమిది గ్రామాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో అర్బన్ ఓటర్‌ల‌లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావం కూడా ఎక్కువగానే ఈ ఎన్నికలలో కనిపించిందని చెప్పాలి. కాపులతో పాటు వైశ్య, కమ్మ, బీసీ, ముస్లిం సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

ప్ర‌చారం, పోలింగ్‌లో టీడీపీ వార్ వ‌న్‌సైడ్ అనుకున్న ఏలూరులో ఫైన‌ల్‌గా చంటి ఏకంగా 61261 ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇది మామూలు విజ‌యం కాద‌నే చెప్పాలి. బుజ్జి ఏలూరు అసెంబ్లీ చ‌రిత్ర‌లోనే తిరుగులేని సెన్షేష‌న‌ల్ విక్ట‌రీతో త‌న రికార్డు లిఖించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: