అలుపెరగని ప్రయాణంలో గెలిచిన బాటసారి పవన్.. బాబు, పవన్ బంధం ఎంతో స్పెషల్!

Reddy P Rajasekhar
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను గెలవడంతో పాటు జనసేన నేతలను గెలిపించుకోవడంతో ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఏపీలో జనసేన సైతం కీలక పార్టీగా అవతరించడంతో పాటు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పనున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించనున్నారు. బాబు, పవన్ కలిసి పని చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఎన్నికల ఫలితాలతో మరోసారి ప్రూవ్ అయింది.
 
చంద్రబాబు, పవన్ బంధం ఎప్పటికీ ప్రత్యేకం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ పదేళ్లలో ఎదుర్కొన్న అవమానాలు అన్నీఇన్నీ కావు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ రియల్ లైఫ్ లో మాత్రం నిజమేనని ప్రూవ్ అయింది. దత్తపుత్రుడనే మాటలతో విమర్శలు చేసినా ఆ విమర్శలను తట్టుకుని పవన్ కెరీర్ పరంగా ముందడుగులు వేశారు.
 
పవన్ కు ప్రజలే అండగా నిలబడి ఆయనను గెలిపించుకున్నారు. పదేళ్ల అజ్ఞాతవాసం అనుభవించిన పవన్ ఇప్పుడు చంద్రబాబుతో కలిసి ఏపీ రాజకీయాలను రూల్ చేయబోతున్నారు. ఒక్కో సినిమాకు 100 కోట్లు వచ్చే అవకాశం ఉన్నా బాబుతో కలిసి ముందడుగులు వేయడానికే పవన్ సిద్ధమయ్యారు. చంద్రబాబు, తాను కలిస్తే మాత్రమే ఏపీ ప్రజలు కోరుకునే పాలనను అందించడం సాధ్యమని పవన్ బలంగా నమ్మారు.
 
చంద్రబాబు, పవన్ భవిష్యత్తులో కూడా కలిసి ఎన్నికల్లో పని చేస్తే ఎప్పటికీ ఇతర పార్టీలకు ఏపీలో అవకాశం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చాలా సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకరికొకరు మోరల్ గా కూడా సపోర్ట్ ను అందించుకున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో పవర్ స్టార్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ ఇకపై రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అనిపించుకోనున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసినా బాబు, పవన్ ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: