కేసీఆర్ చెప్పుకోడానికి ఏం మిగల్లేదు.. మెదక్ కూడా పాయే?

praveen
మెదక్ గడ్డపై ఈసారి ఎవరి జెండా ఎగర పోతుంది. ఇదే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఎంత బలహీనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పార్టీలోని కీలక నేతలందరూ కూడా కారు దిగి మరో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సమయంలో కనీసం కెసిఆర్ సొంత జిల్లా అయిన మెదక్లో అయినా బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంద లేదా అనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ ఉంది.

 ఎన్నికల కౌంటింగ్ కి ముందు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో బిఆర్ఎస్ పార్టీ ఒక సీట్లో మాత్రమే విజయం సాధిస్తుంది అని ఎంతోమంది నిపుణులు అంచనా వేశారు. అయితే ఆ ఒక్క సీటు కేవలం మెదక్ మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ మెదక్ లో కూడా కనీసం బిఆర్ఎస్ అటు విజయాన్ని సాధించలేకపోయింది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో డకౌట్ అయింది. ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయిన బిఆర్ఎస్ పార్టీ చివరికి పరువు పోగొట్టుకుంది. రానున్న రోజుల్లో ఆ పార్టీ పతనం ఖాయమని ప్రత్యర్ధులు విమర్శించే పరిస్థితికి వచ్చింది.

 బిఆర్ఎస్ మెదక్లో అటు మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి ని బరిలోకి దింపగా.. బిజెపి నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బరిలో నిలిచారు. ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి నీలం మధు పోటీ చేయగా.. ఇక మొదటి నుంచి ఎవరికీ సరైన లీడింగ్  రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది  అయితేచివరి రౌండ్లలో అటు బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు భారీ మెజారిటీ సాధించారు. ఈ క్రమంలోనే గులాబీ దళపతి సొంత ఇలాక అయిన మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాషాయ జండా ఎగరవేశారు రఘునందన్ రావు. 33,727 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు అని చెప్పాలి. ఇక సొంత జిల్లాలోనే కెసిఆర్ పార్టీని గెలిపించుకోలేకపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: