పెనమలూరు : నాన్ లోక‌ల్ జోగిని జోకొట్టి ఇంటికి పంపేశారు.. బోడే ప్ర‌సాద్ కం బ్యాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ విక్ట‌రీ

RAMAKRISHNA S.S.
తాజా ఎన్నికలలో అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ట్విస్టులు, ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకున్న‌ నియోజకవర్గాలలో కృష్ణా జిల్లాలోని పెనమలూరు ఒకటి. ఈ నియోజకవర్గంలో తాడిగడప నగర పంచాయతీ తో పాటు.. పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు నగర పంచాయతీ, ఉయ్యూరు మండలాలు విస్తరించి ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలలో ఎక్కడ ప్రత్యర్థులు మారారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సీటు వస్తుందా ? రాదా.. అన్న సస్పెన్స్ చివరి వరకు నడిచింది. పరిణామాలు తీవ్ర ఉత్కంఠ మధ్య సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించి సీటు దక్కించుకున్నారు బోడే ప్రసాద్.

వైసీపీ నుంచి గత ఎన్నికలలో గెలిచిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీ కండువా కప్పుకుని నూజివీడు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జగన్.. పెడన ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్ ను అనూహ్యంగా పెనమలూరు కి బదిలీ చేసి.. ఇక్కడ పోటీ చేయించారు. వాస్తవంగా చూస్తే పెనమలూరు తెలుగుదేశం పార్టీకి... కమ్మ సామాజిక వర్గానికి పెట్టని కోటగా ఉంది. తాజా ఎన్నికలలో యాదవ సామాజిక వ‌ర్గానికి చెందిన పార్థసారధిని కాదని గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ కు సీటు ఇవ్వటం జగన్ చేసిన బిగ్ మిస్టేక్ అని వైసిపి వాళ్ళే భావించారు.

ఎన్నికల ప్రచారం.. పోలింగ్ తర్వాత కూడా.. ఇక్కడ కచ్చితంగా బోడే ప్రసాద్ విజయం సాధిస్తారని అంచనాలే ఎక్కువగా వినిపించాయి. పైగా నియోజకవర్గానికి బోడే ప్రసాద్ లోకల్. కాగా జోగి రమేష్ నాన్ లోకల్. కృష్ణాజిల్లాలో మైలవరం, పెడన, పెనమలూరు ఇలా మూడు నియోజకవర్గాలు మారి మారి జోగి రమేష్ ఇక్కడికి రావడం కూడా వైసీపీ వాళ్ళు పెద్దగా సహకరించలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఇక ఫైన‌ల్‌గా పెన‌మ‌లూరు బాస్‌గా బోడే ప్ర‌సాద్ అదిరిపోయే విక్ట‌రీ కొట్టారు. మొత్తం 22 రౌండ్ల‌లో 17 రౌండ్ల‌కే 50 వేల + మెజార్టీ దాటేసి దూసుకు పోతున్నారు. నిజంగా సీటు లేన‌ప్పుడు పోరాటం చేసి ఎమోష‌న‌ల్ గా మెప్పించి సీటు ద‌క్కించుకున్న బోడే ఈ రోజు అదిరిపోయే విజ‌యం త‌న ఖాతాలో వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: