మామ ఎన్టీఆర్ రికార్డును తిరగరాసిన చంద్రబాబు.. కొత్త చరిత్రను లిఖించాడుగా!

Reddy P Rajasekhar

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఏపీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడంతో పాటు ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. మామ ఎన్టీఆర్ రికార్డును చంద్రబాబు నాయుడు తిరగరాయడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ నాలుగుసార్లు ప్రమాణ స్వీకారం చేయగా త్వరలో నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తూ సీనియర్ ఎన్టీఆర్ రికార్డ్ ను సమం చేశారు.
 
అయితే సీనియర్ ఎన్టీఆర్ కంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు ఆ రికార్డ్ ను తిరగరాశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం రెండు పార్టీలకు ప్లస్ అయింది. టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరినీ గెలిపించుకోగలుగుతున్నారు
 
జనసేన మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడం పక్కా అని వైసీపీ కంటే జనసేనకే ఎక్కువ స్థానాలు వస్తాయని తేలిపోయింది. జనసేన ఈ ఎన్నికల్లో విజయం సాధించడం భవిష్యత్తులో గాజు గ్లాస్ సింబల్ కు సైతం ఢోకా ఉండదని తెలుస్తోంది. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఓటర్లను ఫిదా చేసింది. బాబు హామీలతో తమ భవిష్యత్తు బంగారం అవుతుందని ఏపీ ఓటర్లు భావించారని ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థమవుతుంది.
 
పోల్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు తెలివిగా వేసిన అడుగులు పార్టీ గెలుపునకు కారణమయ్యాయి. మీడియా, పోలింగ్ ఇలా అన్నింటినీ అద్భుతంగా మేనేజ్ చేసి చంద్రబాబు తాను నిర్దేశించుకున్న భారీ లక్ష్యాన్ని ఎట్టకేలకు సాధించారు. రాష్ట్రంలో 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేయగా 135 స్థానాల్లో టీడీపీకి విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ చేసిన 90 శాతానికి పైగా స్థానాల్లో విజయం సాధించడం అంటే సులువు కాదు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం కొండంత లక్ష్యాన్ని సైతం అలవోకగా సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: