కాంగ్రెస్ దెబ్బకు కార్ పంచర్.. ఇక డైరెక్ట్ గా షెడ్డుకే?

praveen
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ లో అనూహ్యమైన ఫలితాలు వెలువడుతున్నాయి  . కౌంటింగ్ కి  మూడు రోజుల ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన అంచనాలే ఇక ఇప్పుడు ఎగ్జాక్ట్ గా వస్తున్నాయి. బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని మొన్నటి వరకు నమ్మిన వారు.. ఇది నిజమే అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా విజయాన్ని అందుకోలేకపోయింది  కారు పార్టీ. ఒకవైపు కాంగ్రెస్ ఇంకోవైపు బిజెపిలు కారు పార్టీ సిట్టింగ్ స్థానాలన్నింటిలో కూడా పాగా వేసి తమ పార్టీ జెండా ఎగరవేశాయి.

 అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గులాబీ పార్టీ జాడ లేకుండా చేయాలని ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటికే అటు బి ఆర్ ఎస్ పార్టీ కంచుకోట లాంటి పార్లమెంట్ సెగ్మెంట్లో సైతం భారీ ఓట్ల ఆదిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తుంది. ఇలా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా  బిఆర్ఎస్ పార్టీకి షాక్ లు తప్పడం లేదు. అయితే జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఇలాగే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది కారు పార్టీ. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ కారు పార్టీని వదిలి బిజెపిలో చేరారు. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. దీంతోఅసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ లో చేరిన గాలి అనిల్ కుమార్ కు టికెట్ ఇచ్చింది బిఆర్ఎస్.

 అయితే ఇక్కడ త్రిముక పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండడం..ఇక జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కొన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ స్థానాల్లో ఉండడంతో ఇక కాంగ్రెస్ విజయం ఖాయంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శేఖర్ 45,962 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ బిజెపి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ రెండవ స్థానంలో.. బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: