ఇది మాస్ కాదు.. ఊరమస్ విక్టరీ.. ఎలక్షన్స్ లో ఒక హిస్టరీ?

praveen
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ లో అనూహ్యమైన ఫలితాలు వెలువడుతున్నాయి అన్న విషయం తెలిసిందే . కౌంటింగ్ కి  మూడు రోజుల ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన అంచనాలే ఇక ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నిజమవుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని మొన్నటి వరకు నమ్మిన అందరూ కూడా ఇది నిజమే అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా విజయం సాధించలేకపోయింది కారు పార్టీ. ఒకవైపు కాంగ్రెస్ ఇంకోవైపు బిజెపిలు కారు పార్టీ సిట్టింగ్ స్థానాలన్నింటిలో కూడా పాగా వేసి తమ పార్టీ జెండా ఎగరవేశారు.

 అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గులాబీ పార్టీ జాడ లేకుండా చేయాలని ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటికే అటు బి ఆర్ ఎస్ పార్టీ కంచుకోట లాంటి పార్లమెంట్ సెగ్మెంట్లో సైతం భారీ ఓట్ల ఆదిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారూ కాంగ్రెస్ అభ్యర్థులు. అలాంటిది కాంగ్రెస్ కంచుకోట లాంటి స్థానంలో ఇంకా ఎలాంటి మెజారిటీ రావాలి. అలాంటి హిస్టారికల్ మెజారిటీతోనే కాంగ్రెస్ విజయం సాధించింది. నల్గొండ లో భారీ విక్టరీ అందుకుంది.

నల్గొండలో కాంగ్రెస్ నుండి  నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి కంచర్ల క్రిష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పోటీలో నిలిచారు. నల్గొండ ఎంపీ స్థానం కాంగ్రెస్(Congress) సిట్టింగ్ స్థానం కావడమే కాదు ఆ పార్టీకి కంచుకోట కూడా. రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ దే గెలుపు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది అందుకే ఇక్కడ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఏకంగా 5.5 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర హిస్టరీ లోనే ఒక అభ్యర్థికి ఈ రేంజ్ లో మెజారిటీ రావడం మొదటిసారి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg

సంబంధిత వార్తలు: