చేయి దెబ్బ.. కారు విలవిల.. మరో సిట్టింగ్ సీట్ గాన్?

praveen
తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ కౌంటింగ్ ఉత్కంఠకు  తెరపడలేదు. కానీ ఒక పార్టీ భవితవ్యం పై మాత్రం అందరికీ ఒక స్పష్టత దాదాపుగా వచ్చింది. ఆ పార్టీ ఏదో కాదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర  కోసం పనిచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తిరుగులేని  పార్టీగా ఎదిగింది. ఇప్పుడు ఆ బిఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా  మారిపోయింది. ఆ పార్టీ భవితవ్యం ఏంటి అంటే ఆ పార్టీ నేతలు కూడా ఏం చెప్పాలో తెలియక బిక్క ముఖం వేసే పరిస్థితి నెలకొంది.

 ఎందుకంటే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష హోదాకి వచ్చినప్పటి నుంచి  చావు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా గులాబీ పార్టీలో కీలక పదవులను అనుభవించిన నేతలు అందరూ కూడా ఏకంగా కారు గుర్తుని వదిలి కాంగ్రెస్ lo చేరారు. కొంతమంది బిజెపిలో చేరారు. దీంతో ఈ పార్లమెంటు ఎలక్షన్స్ లో నిలబెట్టడానికి అభ్యర్థులే పరిస్థితి  బిఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో అయిన గులాబీ పార్టీ సత్తా చాటుతుందని ఆ పార్టీ కార్యకర్తలు నేతలు నమ్మకం పెట్టుకున్నారూ.

 కానీ ఊహించని రీతిలో కార్ పార్టీ ఒక్క సీట్లో కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఒకప్పుడు వార్ వన్ సైడ్ అన్నట్లుగా పోరు కొనసాగించిన బిఆర్ఎస్ పార్టీకి ఇక ఇప్పుడు ప్రత్యర్ధులకు  కనీస పోటీ ఇవ్వలేకపోతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. బిఆర్ఎస్ పార్టీ సీటింగ్ స్థానంలో కొనసాగుతున్న మహబూబాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది  హస్తం పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీ ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితపై ఘనవిజయాన్ని అందుకున్నారు. మొదటినుంచి ఆదిక్యంలో కొనసాగిన బలరాం నాయక్ సిట్టింగ్ స్థానంలో కారు పార్టీని కోరుకోలేని దెబ్బ కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: