కంటోన్మెంట్ ను వదలని కాంగ్రెస్.. ఇంకెక్కడి బిఆర్ఎస్.. ఈ ఓటమితో అంతా అయిపోయింది?

praveen
ప్రతిపక్షం లోకి వచ్చిన తర్వాత అటు బిఆర్ఎస్ పార్టీకి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు అధికారంలో ఉండగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా పోటీ చేయడానికి ఎంతో మంది అభ్యర్థులు సిద్ధంగా ఉండేవారు. ఇక ఎవరికైనా టికెట్ ఇస్తే ఏకంగా అసంతృప్తిని వెళ్ళగక్కే నేతలు కూడా చాలామందే. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కనిసం నిలబెట్టడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది.

 ఈ క్రమంలోనే ఇలాంటి పరిస్థితుల మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది కారూ పార్టీ. కనీసం ఈసారి అయినా మెజారిటీ సాధించి ఇక పార్టీలో ఉన్న నేతలను నిలుపుకోవాలని ఆశ పెట్టుకుంది. కానీ ఊహించని రీతిలో అటు బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలబోతుంది అన్నది ఇప్పటికే విడుదలైన ఫలితాల ద్వారా అర్థమయిపోయింది. అయితే కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే కాదు అటు పార్లమెంట్ ఎన్నికల తో పాటు జరిగిన కంటోన్మెంట్ పై ఎలక్షన్స్ లో కూడా బిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో అక్కడ ఉపఎన్నిక వచ్చింది.

 అయితే కనీసం ఈ అసెంబ్లీ స్థానాన్ని అయినా టిఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుంది అనుకుంటే.. ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి షాప్ తప్పలేదు. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంగా ఉన్న కంటోన్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బిఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్న పై ఇలా విజయ డంక మోపించారు. అయితే అటు మూడో స్థానం లో బిజెపి వంశ తిలక్ నిలిచారు అని చెప్పాలి. ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా దక్కించు కోలేకపోయిన బిఆర్ఎస్ నిరాశలో ఉండగా ఇక కంటోన్మెంట్లో ఓటమి పుండు మీద కారం చలినట్టుగా మారిపోయింది పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: