కాలర్ ఎగరు వేస్తున్న టీడీపీ ఫ్యాన్స్.. ఈ అరాచకం ఏంట్రా బాబు..!

lakhmi saranya
తాజా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఈసారి కృష్ణాజిల్లా రాజకీయంగా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవచ్చు. రాజధాని అమరావతి అంటే కృష్ణ జిల్లా ప్రజలు అందరూ విజయవాడ రాజధాని అవుతుందని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రాజధానిగా ఓ వెలుగు వెలిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈసారి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని వీకేంద్రీకరణ ప్రభావం తో కచ్చితంగా అధికార వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తప్పదని అంటున్నారు.
ఇక ఇక్కడ వైసిపికి షాకులు తప్పవనే అందరూ అనుకుంటున్నారు. ఇక ఈరోజు జరిగిన కౌంటింగ్ లోనూ ఇదే నిజమయింది. ఇక విజయవాడ టిడిపి సీటింగ్ ఎంపీ కేశినేని నాని కూడా టిడిపి నుంచి వరుసుగా రెండుసార్లు గెలిచి విజయవాడ ఎంపీగా పోటీ చేయడంతో ఈసారి కృష్ణా జిల్లా రాజకీయం రసవత్తం అయింది. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీ మారి టీడీపీ అభ్యర్థిగా మైలవరం నుంచి పోటీలో దిగారు. రాజధాని మార్పు ప్రభావం ఎంత ఉంటుందన్నది ఎవరికీ అంతు పట్టలేదు. ఈరోజు జరిగిన కౌంటింగ్ లో ఉమ్మడి కృష్ణ జిల్లాలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు.
కృష్ణ లో విజయవాడ వెస్ట్ లో కేంద్ర మాజీ మంత్రి సుజన చౌదరి, మైలవరంలో వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చి పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ ఆదిక్యం లో ఉన్నారు. విజయవాడ వెస్ట్ అండ్ ఈస్ట్.. నందిగామ, జగ్గయ్యపేట, పామార్రు, పెడన, బందరు.. చివరకు గుడివాడలో వైసిపి ఫైర్ బ్రాండ్ కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు. మచిలీపట్నంలో వైసీపీ కీలక నేత పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వెనుకంజలో ఉన్నారు.  ఇక ఒక తిరువూరు మాత్రమే వైసిపి ఆదిక్యం లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నాని మరియు వంశీ ఇద్దరు కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. ఏదేమైనా ఓవరాల్ గా ఉమ్మడి కృష్ణ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో దూసుకుపోతున్న వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: