ఏపీ సిఎం:ఓటమిని అంగీకరించలేకపోతున్న జగన్.. పదవికి రాజీనామా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు ఈ రోజున ఎట్టకేలకు విడుదలవుతున్నాయి.. అయితే ఇప్పటివరకు కొనసాగుతున్న ఓటింగ్ ఫలితాల ప్రక్రియల వైసీపీ పార్టీ 20 టీడీపీ 131 బిజెపి 7 జనసేన పార్టీ 19 సీట్ల ముందు అంజతో ఉన్నది.. దీని బట్టి చూస్తే టిడిపి పార్టీ గెలుపు ఖాయం అనే విధంగా కనిపిస్తోంది. దీంతో అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ టిడిపి నేతలు ఇప్పటికే సంబరాలు సంబరాన్ని అంటించేలా చేస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా సీఎం జగన్ తమ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల ఫలితాలలో కూటమి టిడిపి బిజెపి జనసేన మొత్తం మీద 155 సీట్లతో ముందు వరుసలో ఉన్నది వైసీపీ పార్టీ 20 సీట్లతో ఉన్నారు.. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మధ్యాహ్నం  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉన్నది.. టిడిపి నేతలు సైతం వైసీపీ ప్రభుత్వం పైన ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే తమ పార్టీలను ఇంత మెజారిటీతో గెలిపిస్తున్నారంటు తెలియజేస్తున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో గవర్నర్ను కలిసి ఆయనకు తన రాజీనామా లేఖను సమర్పించబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం టిడిపి పార్టీ నాలుగు సీట్లు విజయకేతం ఎగరవేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆరా మస్తాన్, వేణు స్వామి వంటి వారు వైసిపి పార్టీ గెలుస్తుందని చెప్పడంతో మరింత ధీమాని వ్యక్తం చేశారు కానీ ఇలాంటి పరిస్థితి చూసి అందరూ ఒక్కసారిగా కంగుతున్నట్లుగా కనిపిస్తోంది. మరి వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా అన్న సైతం దక్కించుకుంటుందో లేదో అని అనుమానం కూడా మొదలవుతోంది. మరి ఏమి రాక పూర్తి ఫలితాలు మరికొన్ని గంటలలో వెలువడనున్నాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయంపై కూడా క్లారిటీ రాబోతోంది. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును వైసీపీ పార్టీ ఏకీభవిస్తుందా అనే విషయం పైన కూడా స్పందిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: