హస్తం దెబ్బకు.. గాలి ఆగింది.. కమలం వాడింది?

praveen
అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్  పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంది. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా పావులు కదిపింది. ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగిలిన నిలబడింది. ఏకంగా ఆ పార్టీ నుంచి గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న నేతలు చివరికి పార్టీకి గుడ్ బై చెప్పేసి మరో పార్టీలో చేరిన వెనకడుగు వేయలేదు.  అయితే  జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితె నెలకొంది. అక్కడ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చోటు చేసుకున్నాయ్. సాధారణంగా అయితే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ కంచుకోటగా అంటూ ఉంటారు.
 ఎందుకంటే ఇక్కడ రెండుసార్లు బిఆర్ఎస్ విజయం సాధించింది. కానీ ఎన్నికల ముందు  బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. సాధారణంగా  ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీలు లింగాయత్ లే ఎక్కువ. ఇప్పుడు వరకు జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మూడుసార్లు ఎన్నికలు జరిగితే మూడుసార్లు లింగాయత్ వర్గానికి చెందిన నేతలే ఎంపీగా ఎన్నికయ్యారు.
 ప్రస్తుతం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో బిజెపి తరఫున బీబీ పాటిల్ బరిలో నిలవగా.. కాంగ్రెస్ తరపున సురేష్ షెత్కర్ కి టికెట్ దక్కింది. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీని వీడటంతో ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరిన గాలి అనిల్ కుమార్ ను ఇక్కడి నుంచి బరిలోకి నిలిపింది బీఆర్ఎస్. అయితే తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని అనుకుంది. కానీ ఇక కాంగ్రెస్ పార్టీ కారుని పంచర్ చేసేసింది. ఎందుకంటే ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ శట్కర్   18237 ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు. దీంతో జహీరాబాద్ గడ్డపై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగానే కనిపిస్తుంది. ఇప్పటివరకు 21 రౌండ్ పూర్తికాగా.. మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఇంకా కాసేపట్లో సునీల్ శెట్కర్ అధికారిక విజేతగా మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: