వెయిట్ అండ్ సీ.. కేసిఆర్ కంచుకోట బద్దలవ్వబోతుంది?

praveen
సాధారణంగా  ఎన్నికల రిజల్ట్ కి ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమవుతాయి అని చెబుతూ ఉంటారు. అయితే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగక ఈరోజు ఉదయం నుంచే ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే కౌంటింగ్ కి రెండు మూడు రోజుల ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ గా మారిపోతున్నాయి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే బిజెపి 9 లేదా 8 స్థానాలలో.. అధికార కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.

 అయితే ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించదని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తే.. ఇక కేవలం ఒకే ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉందని ఇంకొన్ని సర్వేలు చెప్పాయి. అయితే ఆ ఒక్క స్థానం కెసిఆర్ సొంత జిల్లా అయినా మెదక్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే మొదటి రౌండ్ నుంచే ఇక్కడ ఫలితాలలో ఉత్కంఠ నెలకొంది. రౌండ్ కి ఆధిక్యత మారుతూ వచ్చింది. కానీ ఇటీవల బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పష్టమైన ఆదిక్యాన్ని సంపాదించుకున్నారు అన్నది తెలుస్తోంది.

 మెదక్లో ఏకంగా 16,576 ఓట్ల ఆదిత్యంలోకి వచ్చారు రఘునందన్ రావు. ఈ క్రమంలోనే అటు గులాబీ దళపతి కేసీఆర్ కంచుకోటగా పిలుచుకునే.. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఇప్పుడు కాషాయ జెండా ఎగరబోతుంది అన్నది అర్థమవుతుంది. అయితే సొంత జిల్లాలోనే కారు పార్టీ గెలవకపోతే చివరికి ఇక గులాబీ పార్టీ పతనం ఖాయమని అటు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు అని చెప్పాలి. దీంతో వెయిట్ అండ్ సీ గులాబీ కంచుకోటపై కాషాయ జెండా ఎగర పోతుంది అంటూ బిజెపి శ్రేణులు అందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: