వార్నీ.. తెలంగానోళ్లు కేసీఆర్ ను ఇంత ద్వేషిస్తున్నారా?

praveen
తెలంగాణ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది ఆయనే. యువత అందరిని ఒక్కతాటిపై నడిపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేసిన పోరాటాన్ని ఎవరు మరువలేరు.  ఇంత చేసాడు కాబట్టే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏకంగా కేసీఆర్ను సీఎం చేసేసారు తెలంగాణ ప్రజలు. రెండోసారి కూడా ఆయనకే పట్టం కట్టారు. కానీ ఎందుకు మూడోసారి మాత్రం కెసిఆర్ ను నమ్మలేకపోయారు తెలంగాణ ప్రజలు.

 చివరికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని సీఎం కూర్చి నుంచి దింపేశారు. ప్రతిపక్ష హోదాకి పరిమితం చేశారు. అయితే ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని ఉంటారని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అటు కారు పార్టీ అద్భుతంగా పుంజుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఇంత ద్వేషిస్తున్నారా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది  ఎందుకంటే ఎక్కడ కారు పార్టీ విజయం సాధించేలా కనిపించడం లేదు. గులాబీ పార్టీ కంచుకోటలో సైతం బద్దలవుతున్నాయి.

 బిజెపి కాంగ్రెస్ పార్టీలు తప్ప మరో పార్టీ ఎక్కడ విజయం సాధించదు అనే పరిస్థితి నెలకొంది   మరీ ముఖ్యంగా కొన్ని స్థానాలలో కాంగ్రెస్ లక్షల మెజారిటీ సాధిస్తున్న తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు అటు కారు పార్టీని ఇంతలా ద్వేషిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఏకంగా 3. 44 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు ఖమ్మంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని రఘురాం రెడ్డి 3.24 లక్షలు మెజారిటీతో ముంజలు ఉన్నారు  ఇలా ఏకంగా బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలోకి కూడా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుండడంతో.. కెసిఆర్ పని అయిపోయింది అంటూ ఎంతో మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: