ఆమె గుండె దైర్యమేంటో.. ఇంకా గెలుస్తామనే అంటుందిగా?

praveen
ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన టెన్షన్ ఎవరిలో తగ్గడం లేదు కదా పెరిగిపోతుంది. దీనికి కారణం ఎన్నికల ఫలితాలలో ఎవరికి మెజారిటీ రాబోతుంది అని.  ఈ విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం రౌండ్ల వారిగా ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోవైపు బిజెపి పార్టీలు పూర్తి ఆధిక్యతను కొనసాగిస్తున్నాయ్. అయితే అటు బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక స్థానంలో గెలుస్తుందా లేదా అనే విషయంపై అనుమానాలు ఉన్నాయి. ఎప్పటిలాగానే ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆదిక్యంలో కొనసాగుతోంది .

 ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణలో పట్టు సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బిజెపి పార్టీకి.. ఇక ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ బాగా కలిసి వస్తున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బిజెపి పార్టీ మంచి మెజారిటీ సాధించి దూసుకుపోతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రస్తుతం మెజారిటీ స్థానాలలో లీడింగ్ లో కొనసాగుతుంది కమలం పార్టీ. అయితే ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ మాత్రం దారుణంగా ఉంది ఒకచోట అయినా గెలుస్తుందా ఓడుతుందా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నావి అని చెప్పాలి. అయితే బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై ఎన్ని ఆశలు పెట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 అయితే ఇక్కడ మాధవి లతను బరిలోకి దింపగా.. ఆమె కూడా ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే విజయం సాధించేలాగే కనిపించారు. కానీ ప్రస్తుతం ఉదయం నుంచి కౌంటింగ్ వివరాలు విడుదలవుతూ ఉండగా.. ఏ రౌండ్ లోను అటు మాధవి లత ఆదిక్యంలోకి రాలేకపోయారు అని చెప్పాలి. దీంతో ఇక బిజెపి వ్యూహాలు ఫలించలేదని మరోసారి హైదరాబాద్ గడ్డపై ఎంఐఎం జెండా ఎగరబోతుంది అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇలాంటి సమయంలో అటు మాధవి లత చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయ్. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బిజెపి గెలుస్తుందని మాధవి లత ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి 400కు పైగా సీట్లు సాధిస్తుంది అని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. ఒకవైపు లీడింగ్ లేకపోయినా ఓడిపోతున్నామని తెలిసిన గెలుస్తామని ఇంకా ఎలా చెప్పగలుగుతుందో అని అందరు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: