ఓటమి అంచున వైసిపి.. జనసేన సీట్ల కంటే ఘోరం..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఈ రోజున వెలుపడ్డాయి. ఇంకా ఫలితాలు ఓటు కొనసాగుతూనే ఉంది.. అయితే ఎన్నికలు వారు వన్ సైడ్ టిడిపి పార్టీకి వెళ్లినట్లుగా కనిపిస్తోంది. ఈసారి అధికార పార్టీ వైసిపి ఓటమి దాదాపుగా ఖరారు అయిపోయింది. మొత్తం మీద 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో టిడిపి జనసేన బిజెపి కూటమిగా 155 స్థానాలను ఆదిత్యతో ముందుకు వెళ్తోంది. కేవలం వైసీపీ పార్టీ 16 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు వై నాట్ 175 అన్న నినాదంతో వైసిపి నేతలు ముందుకు వెళ్లారు.

కానీ ఎన్నికల ఫలితాలు చూసి ఒక్కసారిగా అందరూ కంగు తింటున్నారు. కనీసం జనసేన పార్టీ సాధించిన అన్ని సీట్లు కూడా దక్కించుకుంటాయో లేవో అనే పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో అటు పార్టీ శ్రేణులు నేతలు తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.. ఇదే సమయంలో పలువురు మంత్రులు సైతం ఓటమి బాటలో పయనిస్తూ ఉన్నారు. అయితే చివరి రౌండులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వైసిపి నేతలు గెలిచే అవకాశం అయితే ఎక్కడా కనిపించడం లేదని కూడా చెప్పవచ్చు..

అలాంటి వారిలో బొత్స సత్యనారాయణ, ఉషాశ్రీ చరణ్, రాజన్న దొర, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, దాడిశెట్టి రాజా, అంబాటి రాంబాబు ,విడుదల రజిని, జోగి రమేష్ తో సహా పలువురు కీలకమైన నేతలు కూడా ఓటమి బాటలు పట్టేలా కనిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం టిడిపి 129 .. వైసిపి 19.. జనసేన 20 బిజెపి ఏడు స్థానాలలో లీడ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే టిడిపి ఒక్కటి విన్నింగ్ సీట్ కొట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలు ప్రస్తుతం సంబరాలు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇంతటి స్థాయిలో పడిపోతుందని కేవలం కేకే సర్వే నే వైసీపీ పార్టీకి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: