మెదక్ లో ట్విస్టుల మీద ట్విస్టులు.. ఉత్కంఠతో నరాలు తెగేలా ఉన్నాయ్?

praveen
ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అటు బిఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. ఎందుకంటే ఒకప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా పోటీ చేయడానికి ఎంతో మంది అభ్యర్థులు పార్టీలో ఉండేవారు. ఇక ఎవరికైనా టికెట్ ఇస్తే ఏకంగా అసంతృప్తిని వెళ్ళగక్కే నేతలు కూడా చాలామంది కనిపించేవారు. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కనిసం పోటీలో నిలబెట్టడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది.

 ఈ క్రమంలోనే ఇలాంటి పరిస్థితుల మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది గులాబీ  పార్టీ. కనీసం ఈసారి అయినా మెజారిటీ సాధించి ఇక పార్టీలో ఉన్న నేతలను నిలుపుకోవాలని అనుకుంది. కానీ ఊహించని రీతిలో అటు బి ఆర్ ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలబోతుంది అన్నది ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు  ద్వారా అయ్యింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో బిఆర్ఎస్  పార్టీ గెలుస్తుంది అనుకున్న.. అక్కడ గెలుస్తుందా లేదా అన్న విషయంపై చివరికి అనుమానాలు నెలకొన్నాయ్ అన్నది తెలుస్తుంది. అయితే  కెసిఆర్ సొంత జిల్లా మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో మాత్రం తప్పక ఆ పార్టీకి విజయం వరిస్తుందని పార్టీ శ్రేణులు కూడా బలంగా నమ్మకం పెట్టుకున్నారు.

  మెదక్ ఫలితం విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి సంపూర్ణమైన ఆధిక్యం రావడం లేదు. మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆదిక్యంలో ఉండగా రెండో రౌండ్లో అటు బిఆర్ఎస్ అభ్యర్థి పి వెంకట్రామిరెడ్డి ఆదిక్యంలోకి వచ్చారు. ఇక ఇటీవల రెండో రౌండ్ ముగిసిందో లేదో మళ్లీ బిజెపి అభ్యర్థి రఘునాథన్ రావు ఆదిక్యంలోకి రావడం గమనార్హం. దీంతో మూడు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరికి కూడా స్పష్టమైన ఆదిక్యం రావడం లేదు. ఈ క్రమంలోనే అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి ఫలితం ఎవరి వైపు ఉంటుంది అనే విషయం గురించి టెన్షన్ పడుతూ ఉత్కంఠతో నరాలు తెగేలా ఉన్నాయని అక్కడి ఓటర్లు అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే చివరి రౌండ్ వరకు కూడా ఎవరికీ లీడింగ్ రాబోతుంది అనే విషయంపై క్లారిటీ వచ్చేలాగా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: