కాంగ్రెస్ గెలుపా.. ఇది బిఆర్ఎస్ పతనమా?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తిరుగులేని పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకసారి ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో కనీసం ఆ పార్టీ ఉంటుందా లేదా అనే దీనమైన స్థితికి పడిపోయింది. కారు పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్న నేపథ్యంలో  కారు పార్టీలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో వచ్చిన పార్లమెంటు ఎన్నికలు ఇక తమ పార్టీ పట్టును నిలుపుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని బిఆర్ఎస్ శ్రేణులు అనుకున్నారు.

 ఇక ఇందుకు అనుగుణంగానే గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచార నిర్వహించారు. కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అనే విధంగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరింత పరువు పోగొట్టుకుంది కారు పార్టీ. ఎందుకంటే కనీసం సిట్టింగ్ స్థానాలను కూడా కాపాడుకోలేక దారుణమైన ఓటములను చూస్తుంది. అయితే ఖమ్మంలో రామసహాయం రఘురామిరెడ్డి చేతిలో లక్షల ఓట్ల మెజారిటీతో బిఆర్ఎస్ సీటింగ్ ఎంపీ ఓడిపోయేలాగే కనిపిస్తుంది  ఏకంగా ఇప్పటికే రఘురాం రెడ్డి 2.16 లక్షల ఓట్ల ఆదిక్యంలో ఉన్నారు. అక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది. కేవలం ఈ ఒక్కచోట మాత్రమే కాదు ఇక రాష్ట్రంలోనే చాలా చోట్ల బిఆర్ఎస్ సీటింగ్ స్థానాలను కూడా కాపాడుకోలేక పోతుంది. కనీసం ఒక్క స్థానంలో అయినా విజయం సాధిస్తుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్. దీంతో ఇది కారు పార్టీ పతనమే అనే అభిప్రాయపడుతున్నారు ఎంతో మంది విశ్లేషకులు.


ఇలా టిఆర్ఎస్ పార్టీ దారుణమైన ఓటమి చవిచూసిన నేపథ్యంలో పార్లమెంట్ ఫలితాలు పూర్తయిన తర్వాత ఇక కారు పార్టీలో ఎన్నో అనూహ్యమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎంతోమంది విశేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: