తనది ఆవేశం కాదు.. ఆంధ్రుల మదిదోచిన సమాలోచనే!

Reddy P Rajasekhar
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఆవేశంగా మాట్లాడతారని చాలామంది భావిస్తారు. అయితే తనది ఆవేశం కాదని ఆంధ్రుల మదిదోచిన సమాలోచనే అని నెటిజన్ల నుంచి అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. దూర దృష్టితో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేశారని ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఏపీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ఇందుకు సంబంధించి ఏ మాత్రం సందేహాలు అక్కర్లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఫలితం ఏ విధంగా ఉంటుందో వైసీపీకి ఈ ఎన్నికల ఫలితాలతో క్లియర్ కట్ గా అర్థమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కష్టానికి తగ్గ ఫలితం ఇంతకాలానికి దక్కిందని మరి కొందరు చెబుతున్నారు.
 
ఇకపై పవన్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో పవన్ మార్క్ పాలన ఎలా ఉండబోతుందో చూడబోతున్నామని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గం ఫలితాలు వెల్లడవుతూ ఉండగా రాయలసీమలో కూడా కూటమి దూసుకెళుతోంది. ఎన్నో నియోజకవర్గాల్లో ఫలితాలు, అంచనాలు తారుమారు అవుతుండటం గమనార్హం. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడాల్లేకుండా అన్ని చోట్లా కూటమి సత్తా చాటుతోంది.
 
వైసీపీ ప్రణాళికలు పూర్తిస్థాయిలో రివర్స్ అయిపోయాయని జగన్ అహంకార పాలనకు దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. కంచుకోటల్లోనే వైసీపీ కుప్పకూలుతూ షాకిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో కూటమి నెగిటివ్ సెంటిమెంట్లను సైతం పాజిటివ్ గా మలచుకోవడం విశేషం అని చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాల విషయంలో కూటమి అంచనాలు, నమ్మకమే నిజమైంది. పవన్ కళ్యాణ్ ఇకపై పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కు మంచి పదవి దక్కితే ఏపీని ఆయన అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఖాయమని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: