రాజు ఎక్కడున్నా రాజే.. వార్ వన్ సైడ్ అయిందిగా?

praveen
ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన టెన్షన్ ఎవరిలో కాస్తయినా తగ్గడం లేదు. ఎవరికి మెజారిటీ రాబోతుంది అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ  ఉంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం రౌండ్ల వారిగా ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోవైపు బిజెపి పార్టీలు పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి. అయితే అటు బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక స్థానంలో గెలుస్తుందా లేదా అనే విషయంపై అనుమానాలు ఉన్నాయి అని చెప్పాలి. ఎప్పటి లాగానే ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆదిక్యంలో ఉంది.

 అయితే మినీ ఇండియా గా పిలుచుకునే  మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో విజయం ఎవరిని వరించబోతుంది అనే విషయంపై అందరిలో ఉత్కంఠ ఉండగా.. అక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గం లో లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏకంగా 1,40,000 కోట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు ఈటెల రాజేందర్  ప్రత్యర్ధులు కనీసం ఇక ఈటల రాజేందర్ కు దరిదాపుల్లో కూడా లేరు అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే అటు మల్కాజ్గిరి నియోజకవర్గం లోని బిజెపి శ్రేణులు అందరూ కూడా సంబరాలు చేసుకోవడానికి సిద్ధమై పోతున్నారు. అయితే  రాజు ఎక్కడున్నా రాజు అంటూ కామెంట్లు చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఎందుకంటే గతంలో హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయం లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు ఈటల రాజేందర్. ఇక అక్కడ వరుసగా విజయాలు సాధించారు. అయితే ఇక ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో కూడా తనకు తిరుగులేదు అని నిరూపించారు. అందుకే ఈటెల రాజేందర్ ఎక్కడున్నా రాజే ప్రజలకు మనసుల్లో ఎప్పుడు నిలిచి ఉంటాడు అంటూ బిజెపి నేతలు అందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: