నిజాంబాద్ గడ్డ.. అరవింద్ అడ్డా.. పత్తాలేని బిఆర్ఎస్?

praveen
ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన టెన్షన్ ఎవరిలో తగ్గడం లేదు . ఎవరికి మెజారిటీ రాబోతుంది అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం రౌండ్ల వారిగా ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోవైపు బిజెపి పార్టీలు పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి. అయితే అటు బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక స్థానంలో గెలుస్తుందా లేదా అనే విషయంపై అనుమానాలు ఉన్నాయి. ఎప్పటిలాగానే ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆదిక్యంలో దూసుకుపోతుంది.

పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా నిజాంబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పోటీ ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎప్పుడూ అనూహ్యమైన ఫలితాలు కారణమవుతూ ఉంటారు. గతంలో 2014లో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూతురు కవిత నిజాంబాద్ నుంచి పోటీ చేసి ఘనవిజయాన్ని అందుకున్నారు. అయితే రెండోసారి బిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఇక మరోసారి అదే పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు కవిత. తప్పకుండా విజయం సాధిస్తారు అనుకున్నప్పటికీ ఊహించని రీతిలో అక్కడి ప్రజలందరూ కూడా బిజెపికి పట్టం కట్టారు.
 పసుపు బోర్డును తీసుకువస్తాము అనే హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ ను గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు 2024 లో కూడా మరోసారి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాను అంటూ హామీ ఇచ్చారు ధర్మపురి అరవింద్. అయితే పసుపు బోర్డు హామీని నిలబెట్టుకున్నట్లుగానే ఈ హామీని కూడా నిలబెట్టుకుంటాడు అని బలంగా నమ్మిన అక్కడి ప్రజలు.. మరోసారి ధర్మపురి అరవింద్ వైపే నిలబడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నిజాంబాద్ సీటును గెలుచుకోవాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అక్కడ వార్ వన్ సైడ్ లాగానే మారిపోయింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే నిజాంబాద్ లో ధర్మపురి అరవింద్ ఏకంగా తొమ్మిది పదివేలకు పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. అయితే రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఉండగా.. ఇక బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోటీ ఇవ్వలేక మూడో స్థానంలో కొనసాగుతూ ఉండడం గమానర్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: