పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ టాలీవుడ్ హీరోయిన్ పోస్ట్..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పైన చాలా ఉత్కంఠత నెలకొన్నప్పటికీ గడిచిన కొన్ని గంటల క్రితం నుంచి ఫలితాలు మొదలయ్యాయి.. అయితే ఈ ఫలితాలు టిడిపి పార్టీకి చాలా అనుకూలంగా మారుతున్నాయి. వైసిపి పార్టీ ఎక్స్పెక్ట్ చేయలేనన్ని సీట్లలో వెనుకంజలో ఉన్నది. దీంతో ఎవరు విజయం సాధిస్తారనే విషయం పైన అటు క్లారిటీ రావడంతో ఇప్పటికే టిడిపి నేతలు చంద్రబాబు ఇంటి వద్ద సంబరాలతో మునిగి తేలుతున్నారు. ఈ ఎన్నికలలో చాలా కీలకమైన నేతగా పేరు పొందారు పవన్ కళ్యాణ్.. ఈసారి పిఠాపురంలో నిలబడడంతో గెలవాలని చాలా మంది నేతలు సెలబ్రిటీలు సైతం పవన్ కళ్యాణ్ కి ప్రచార కర్తగా పనిచేశారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. పిఠాపురం ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని తెలియడంతో చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే స్పందిస్తున్నారు.. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అయినా మాధవి లత ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే నెంబర్ ప్లేట్ తో ఒక ఫోటోని సైతం షేర్ చేయడం జరిగింది మాధవి లత.

మాధవి లత హీరోయిన్గా కేవలం అడపాదడపా సినిమాలలో నటించింది..ఆ తర్వాత సినిమాలకు దూరమై.. ప్రస్తుతం బిజెపి మహిళా నేతగా పేరు సంపాదించింది.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ పలు రకాల వాటిని షేర్ చేస్తూ ఉంటుంది.. ఇప్పుడు తాజాగా ఏకంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే నెంబర్ ప్లేట్ ని షేర్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను అభినందిస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మీరు కూడానా అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: