పాయే.. కంటోన్మెంట్ కూడా పాయే.. కేసీఆర్ కు ఇంకేం మిగిలింది?

praveen
ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అటు బిఆర్ఎస్ పార్టీకి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకప్పుడు అధికారంలో ఉండగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా పోటీ చేయడానికి ఎంతో మంది అభ్యర్థులు సిద్ధంగా ఉండేవారు. ఇక ఎవరికైనా టికెట్ ఇస్తే ఏకంగా అసంతృప్తిని వెళ్ళగక్కే నేతలు కూడా చాలామంది ఉండేవారు. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కనిసం నిలబెట్టడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది.

 ఈ క్రమంలోనే ఇలాంటి పరిస్థితుల మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది బిఆర్ఎస్ పార్టీ. కనీసం ఈసారి అయినా మెజారిటీ సాధించి ఇక పార్టీలో ఉన్న నేతలను నిలుపుకోవాలని భావించింది. కానీ ఊహించని రీతిలో అటు బి ఆర్ ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలబోతుంది అన్నది ఇప్పటికే విడుదలైన ఫలితాల ద్వారా అర్థమవుతుంది. కేవలం ఒకే ఒక్క స్థానంలో బిఆర్ఎస్  పార్టీ గెలుస్తుంది అనుకున్న.. అక్కడ గెలుస్తుందా లేదా అన్న విషయంపై చివరికి అనుమానాలు నెలకొన్నాయ్. అయితే అటు పార్లమెంటు ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక జరిగింది. అక్కడి ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

 ఈ క్రమంలోనే  సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అయినా అటు బిఆర్ఎస్ పార్టీ సీటింగ్ స్థానాన్ని కాపాడుకుంటుంది అనుకుంటే అదే జరిగేలా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంగా ఉన్న కంటోన్మెంట్లో రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 3180 ఓట్ల లీడింగ్ లోకి వచ్చేసారు. ఆయనకు 7704 ఓట్లు రాగా.  బిఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్నకు 5379 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి వంశ తిలక్కు 4,193 నోట్లు వచ్చాయి అని చెప్పాలి. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బిఆర్ఎస్ సెట్టింగ్ స్థానమైన కంటోన్మెంట్ ని కూడా కారు పార్టీ కోల్పోయేలాగే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: