తాను మునిగింది వైసీపీని ముంచింది.. జగన్ విషయంలో షర్మిల సూపర్ సక్సెస్!

Reddy P Rajasekhar
ఏపీలో వైసీపీ ఘోర పరాజయం ఫిక్స్ అయింది. వైసీపీ అభిమానులు సైతం ఈ ఎన్నికల ఫలితాలను ఏపీలో ఘోర ఓటమిని అంగీకరించక తప్పదు. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని విశ్లేషకులు సైతం ఊహించారు కానీ మరీ ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఉమ్మడి కడప జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 
ఏపీలోని దాదాపుగా 150కు పైగా నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి. అయితే వైసీపీ ఘోర పరాజయానికి కారణం ఎవరు అనే ప్రశ్నకు షర్మిల కారణం అనే సమాధానం వినిపిస్తోంది. సొంత చెల్లి జగన్ పై తీవ్ర విమర్శలు చేయడం వైసీపీకి మైనస్ అయింది. షర్మిల తను కాంగ్రెస్ లో చేరి మునగడంతో పాటు వైసీపీని ముంచిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
జగన్ ను ఓడించే విషయంలో షర్మిల సూపర్ సక్సెస్ అయ్యారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షర్మిల మద్దతు పరోక్షంగా కూటమికి ప్లస్ అయిందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. షర్మిల అండగా నిలబడి ఉంటే కనీసం 2014ను మించి వైసీపీకి ఫలితాలు వచ్చేవనే చర్చ జరుగుతోంది. విజయమ్మ న్యూట్రల్ గా ఉండటం కూడా జగన్ కు మైనస్ అయిందనే చెప్పాలి.
 
కర్ణుడి చావుకు ఎన్ని కారణాలో వైసీపీ ఓటమికి అంతకు మించి కారణాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ ఈ ఘోర పరాజయం నుంచి త్వరగా కోలుకుని అడుగులు వేయాల్సి ఉందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ ఈ ఘోర పరాజయానికి కారణాలను విశ్లేషించుకుని అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. వైసీపీకి మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు ఈ రేంజ్ లో దెబ్బేశాయా అని వైసీపీ కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి నెలకొంది. వైసీపీ ఇంత ఘోర పరాజయాన్ని మాత్రం అస్సలు ఊహించలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: