మొనగాడు కేకే.. ఏం చెప్పాడ్రా..!

Reddy P Rajasekhar
ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి 20 నుంచి 25 సంస్థలు సర్వేల ఫలితాలను ప్రకటిస్తే ఈ ఫలితాలకు సంబంధించి వాస్తవానికి దగ్గరగా ఉన్న సర్వే ఏదనే ప్రశ్నకు కేకే సర్వే అనే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో కేవలం వైసీపీ 14 స్థానాల్లో మాత్రమే విజయం సాధించవచ్చని కేకే చెబితే ఎవరూ నమ్మలేదు. అయితే కేకే సర్వే ఫలితాలు దాదాపుగా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
మొదట కేకే సర్వే ఫలితాలను తప్పుబట్టిన వాళ్లే ఇప్పుడు ఆ సంస్థ ఫలితాలే నిజం కానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొండేటి కిరణ్ కూటమికి 161 స్థానాల్లో పాజిటివ్ ఫలితాలు రావచ్చని చెప్పగా ఆ ఫలితాలు దాదాపుగా నిజమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మొనగాడు కేకే అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఆరా మస్తాన్ అంచనాలు తప్పగా కేకే మాత్రం కచ్చితమైన సర్వే ఫలితాలను అందించారు.
 
ఏపీ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి దాదాపుగా 95 శాతం సర్వే సంస్థల అంచనాలు ఫెయిల్ కాగా కేకే ఏ విధంగా సర్వే చేశారో ఎన్ని శాంపిల్స్ సేకరించారో తెలీదు కానీ ఆయన లెక్క మాత్రం తప్పలేదు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని కేకే అంచనా వేయగా ఆ సమయంలో ఆయన సంస్థ సర్వే ఫలితాలు ఏ విధంగా నిజమయ్యాయో ఈ ఎన్నికల్లో సైతం అదే విధంగా నిజం కానున్నాయని తెలుస్తోంది.
 
2014ను మించిన దారుణమైన పరాజయాన్ని ఈ ఎన్నికల్లో వైసీపీ మూటగట్టుకోనుంది. 30కు అటూఇటూ స్థానల్లో మాత్రమే వైసీపీకి విజయం దక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం 151 స్థానాల్లో కూటమి లీడ్ లో ఉండగా వైసీపీ 24 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. ఏపీ ఎన్నికల తుది ఫలితం కూడా దాదాపుగా ఇదే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. జగన్ కలలో కూడా ఊహించని ఫలితాలు వైసీపీకి రానున్నాయని అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: