'కొండా'ను ఢీకొట్టే వారే లేరా.. పాపం ప్రత్యర్ధులు?

praveen
ఏం జరగబోతుంది.. ఎవరు విజయం సాధించబోతున్నారు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో కూడా ఇదే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మే 13వ తేదీన ఓట్లు వేసి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చిన ప్రజలు.. ఇక ఇప్పుడు కౌంటింగ్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇలా ఎన్నికల్లో విజయం కోసం కోట్లు ఖర్చుపెట్టిన అభ్యర్థులు ఇక తమ భవిష్యత్తు ఏంటో అనే విషయం తెలుసుకునేందుకు ఎంతో ఉత్కంఠ గా ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేకపోతే కౌంటింగ్ తర్వాత ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎగ్జిట్ పోల్స్ ని తారుమారు చేస్తాయా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

 ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి అటు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.  అయితే తెలంగాణలో ఎప్పటి నుంచో పట్టు సాధించాలని చూస్తున్న బిజెపి పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అది సాధించేలాగే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మెజారిటీ స్థానాలలో అటు బీజేపీని ఆధిక్యంలో కొనసాగుతుంది. కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి డబుల్ డిజిట్ అందుకునేలాగే కనిపిస్తోంది. అయితే చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

 అయితే చేవెళ్ల నియోజకవర్గం లో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి అటు బిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక హస్తం పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఇక సెట్టింగ్  స్థానం కావడంతో మరోసారి తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కానీ గతంలోనే చేవెళ్లలో ఎంపీగా పనిచేసి విశేషమైన ప్రజాదరణను సంపాదించుకున్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల ఫలితాలలో ముందంజలో దూసుకుపోతున్నారు. కొండను ఢీకొట్టే వారే లేరు అన్నట్లుగా ఆయన లీడింగ్ లో కొనసాగుతున్నారు. తొలి రౌండు ముగిసేసరికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదిత్యాన్ని సంపాదించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: