దూసుకుపోతున్న రఘురాముడి బాణం.. బిజెపి, బిఆర్ఎస్ మైండ్ బ్లాక్?

praveen
తెలంగాణ ప్రజలందరికీ హార్ట్ బీట్ అంతకంతకు పెరుగుతుంది. ఎందుకంటే అందరూ వేచి చూసిన రోజు రానే వచ్చేసింది. మే 13వ తేదీన తెలంగాణ ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఇక తాము గెలిపించుకోవాలి అనుకున్న అభ్యర్థుల భవితవ్యం ఏంటో తేల్చిపడేసారూ. ఈ క్రమంలోనే ఎవరు ఎటువైపుకు నిలిచారు.. ఎవరికి పట్టం కట్టబోతున్నారో అన్న విషయం ఇక నేడు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత క్లారిటీ వస్తుంది. దీంతో కౌంటింగ్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే విషయంపై అందరిలో ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతుంది.

 అయితే కొన్ని పార్లమెంట్ స్థానాల్లో విజయాన్ని ఇక ఆయా పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక అలాంటి వాటిలో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన వియ్యంకుడు  అయిన రామ సహాయం రఘురామిరెడ్డికి పట్టుబట్టి మరి టికెట్ ఇప్పించుకున్నారు. టికెట్ ఇప్పించుకోవడమేనా విజయం బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలోనే  రామ సహాయం రఘురామిరెడ్డి ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్దతుతో ప్రచారంలో దూసుకుపోగా ఇక ఇప్పుడు కౌంటింగ్ ఫలితాలలో కూడా అదే రీతిలో దూసుకుపోతున్నారు.

 రఘురాముడి బాణానికి తిరుగేలేదు అన్నట్లుగా ప్రస్తుతం మంచి ఆధిక్యతను సంపాదిస్తున్నారు అని చెప్పాలి. మొదటి రౌండ్ నుంచే భారీ ఆదిత్యంలో కొనసాగుతున్న రఘురామిరెడ్డి ఇక ఇటీవల ఏకంగా 55 వేల ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. అయితే బిఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీటు అయిన ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఇంత భారీ మెజారిటీ సాధించడంతో ఇక కారు షెడ్డు కు వెళ్లడం ఖాయమని అటు ఎంతో మంది కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నారు. అయితే అటు పొంగులేటి తన పంతం నెగ్గించుచుకొని టికెట్ ఇప్పించుకున్నట్లుగానే ఇక ఇప్పుడు తన వియ్యంకుడు రఘురామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నాడు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg

సంబంధిత వార్తలు: