పెద్దిరెడ్డోరో.... ఏంటి సారు వెన‌క‌ప‌డిపోయారు..!

Reddy P Rajasekhar
వైసీపీ మంత్రి పెద్దిరెడ్డికి పుంగనూరులో భారీ షాక్ తగిలింది. కూటమి అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డి ఇక్కడ ముందంజలో ఉండటం గమనార్హం. ఏపీలో కూటమి సునామీ సృష్టిస్తుండగా వైసీపీ మంత్రులందరూ వెనుకంజలో ఉన్నారు. వైసీపీ సీనియర్ నేతలకు, మంత్రులకు ఎన్నికల ఫలితాలు షాకిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తుండటంతో కార్యకర్తలు సైతం షాకవుతున్నారు.
 
ఏంటి సారు వెనుకబడిపోయారు అంటూ పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వస్తున్న ఫలితాల గురించి కామెంట్లు చేస్తున్నారు. వైసీపీలో కీలక నేతగా పేరును సొంతం చేసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి వేవ్ ఏపీలో కొనసాగుతుందని ఎంతోమంది విశ్లేషకుల అంచనాలు సైతం అబద్ధం కాబోతున్నాయని తెలుస్తోంది.
 
వైసీపీ మంత్రులందరూ వెనుకంజలో ఉండటంతో ఓటమిని ఏ విధంగా సమర్థించుకోవాలో చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. ఏపీలో పోటీ ప్రధానంగా కూటమి, వైసీపీ మధ్యే ఉంది. కాంగ్రెస్ ఏపీ ఎన్నికల్లో ఊసే లేకుండా పోయింది. వైసీపీని ఓడించాలనే షర్మిల లక్ష్యం నెరవేరే పరిస్థితులు ఉన్నా కాంగ్రెస్ ను పుంజుకునేలా చేయడంలో షర్మిల వెనుకబడ్డారనే చెప్పాలి.
 
పోల్ మేనేజ్ మెంట్ విషయంలో వైసీపీ చేసిన తప్పులు ఆ పార్టీని నిండా ముంచేయనున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో ఏకంగా 144 స్థానాల్లో టీడీపీ కూటమి లీడ్ లో ఉండగా 30 స్థానాల్లో మాత్రం వైసీపీ లీడ్ లో ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో మరోమారు సంచలన ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడు పరిస్థితే ఏపీలో రిపీట్ కానుందని సమాచారం అందుతోంది. ఏపీలో వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఇన్నిరోజులు కాన్ఫిడెన్స్ కనబరిచిన నేతలు ఆ నమ్మకం డొల్లేనని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఏపీ ప్రజలు ఐదేళ్లకు ఒకసారి ఊహించని ఫలితాన్ని ఇస్తూ ఉండటం గమనార్హం. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే  వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: