కృష్ణా టీడీపీ ఫ్యాన్స్ కాల‌రెగ‌రేసే గెలుపురా ఇది.. వామ్మో ఈ అరాచ‌కం ఏందిరా బాబు..!

RAMAKRISHNA S.S.
తాజా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఈసారి కృష్ణా జిల్లా రాజకీయంగా చాలా ఆసక్తిగా మారింది. రాజధాని అమరావతి అంటే కృష్ణా జిల్లా ప్రజలు అందరూ విజయవాడే రాజధానిగా భావించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రాజధాని అన్నట్టుగా కృష్ణా జిల్లా వాసులు ఓ వెలుగు వెలిగిపోయారు. అయితే ఈసారి రాజధాని వికేంద్రీకరణ ప్రభావంతో కచ్చితంగా అధికార వైసీపీ పై గట్టి ప్రభావం ఉంటుందన్న అంచనాలు, సర్వేలు, నివేదికలు ముందుగానే వెలువడ్డాయి. దీనికి తోడు విజయవాడ టీడీపీ సీటింగ్ ఎంపీ కేశినేని నాని సైతం వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేయడంతో ఈసారి కృష్ణాజిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. అలాగే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సైతం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకుని పోటీ చేశారు. ఈసారి కృష్ణా జిల్లా రాజకీయం రాష్ట్రవ్యాప్తంగానే ఆసక్తి రేపింది.

రాజధాని మార్పు ప్రభావం ఎంత ఉంటుందన్నది ఎవరికి అంతుపట్టలేదు ఈరోజు జరిగిన కౌంటింగ్ లో ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో కూట‌మి అభ్య‌ర్థులు దూసుకు పోతున్నారు. కృష్ణాలో విజ‌య‌వాడ వెస్ట్‌లో కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి , మైల‌వ‌రంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చి పోటీ చేసిన వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఆధిక్యంలో ఉన్నారు. విజ‌య‌వాడ వెస్ట్‌, ఈ స్ట్‌, నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట‌, పామ‌ర్రు, పెడ‌న‌, బంద‌రు.. చివ‌ర‌కు గుడివాడ‌లో వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని వెనుకంజ‌లో ఉన్నారు. మ‌చిలీప‌ట్నంలో వైసీపీ కీల‌క నేత పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వెనుకంజ‌లో ఉన్నారు. ఒక్క తిరువూరు మాత్ర‌మే వైసీపీ ఆధిక్యంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఏదేమైనా ఓవ‌రాల్‌గా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థులు భారీ మెజార్టీ ల‌తో దూసుకు పోతోన్న వాతావ‌ర‌ణ‌మే ఎక్కువుగా క‌నిపిస్తోంది. అటు విజ‌య‌వాడ ఎంపీ తో పాటు బంద‌రు ఎంపీ సీట్లో నూ కూట‌మి అభ్య‌ర్థులు గెలుపు బాట‌లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: