వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ స్పీడ్‌ కు బ్రేక్‌ ?

Veldandi Saikiran
భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో... భారతదేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ పోస్టల్ బ్యాలెట్ అనంతరం... మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది.
 అయితే మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి... దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ లీడింగ్ లో కనిపించింది. ఇప్పటికే దాదాపు 250 స్థానాలలో బిజెపి పార్టీ లీడింగ్ లో ఉంది. వారణాసిలో... ప్రధాన నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వారణాసి పోస్టల్ బ్యాలెట్  లెక్కింపులో...  ప్రధాని నరేంద్ర మోడీ  దూసుకు వెళ్లారు. మొదటి రౌండులో ప్రధాని నరేంద్ర మోడీకి ఊహించని షాక్ తగిలిందట.
వారణాసి మొదటి రౌండులో ప్రధాని నరేంద్ర మోడీ వెనుకబడ్డట్లు సమాచారం అందుతుంది. వారణాసి ఎంపీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న అజయ్ లీడింగ్ కనబరుస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ  పై ఏకంగా ఆరు వేల ఓట్ల  మెజార్టీతో దూసుకు వెళ్తున్నారట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అజయ్. దీంతో బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరాశ చెందుతున్నారు.

కాగా, వారణాసిలో వెనుకంజలో ప్రధాని మోడీ ఉండగా, గాంధీ నగర్ లో అమిత్ షా దూసుకెళుతున్నారు. న్యూ ఢిల్లీలో బాన్సురి స్వరాజ్, అమేథీలో స్మృతి ఇరానీ, రాయబరేలి, వయనాడ్ లో రాహుల్ గాంధీ దుమ్ములేపుతున్నారు.  లక్నోలో రాజ్ నాథ్ సింగ్, కనౌజ్ లో అఖిలేష్ యాదవ్, మెయిన్ పురిలో డింపుల్ యాదవ్, మధురలో హేమామలిని లీడ్ లో ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. అటు ఏపీలో కూడా ఎన్‌డీఏ కూటమి దూసుకెళుతోంది. ఏపీ అసెంబ్లీ లో 45 స్థానాల్లో కూటమి ఆధిక్యంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: