నీరు గారుతున్న బిజెపి ఆశలు.. అక్కడ ఓటమి తప్పదా?

praveen
అందరూ ఎదురుచూసిన రోజు వచ్చేసింది.  పార్లమెంట్ ఎన్నికల  కౌంటింగ్ ప్రారంభమైంది.  ఈ క్రమంలోనే ఏ పార్టీకి ఆదిక్యం వస్తుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.. ఇటీవల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్లలో ఎవరికి ఆదిక్యం వస్తుంది అనే విషయంపై కూడా అందరూ ఆసక్తిగా చూశారు. అయితే అసలు కౌంటింగ్ కి ముందు మూడు రోజుల క్రితం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో బిజెపి ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లలో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్పాయి.

 ఇక ఇప్పుడు చెప్పినట్లుగానే ప్రస్తుతం తెలంగాణలో మంచి ఆదిక్యత్యతో బిజెపి దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మునుపటితో పోల్చి చూస్తే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేలాగే కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ని ఎగ్జాక్ట్ పోల్స్ గా బీజేపీ మార్చబోతుంది అని అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో ఒక్క స్థానంలో మాత్రం బిజెపి ఆశలను నీరు గారి పోతున్నాయి అని చెప్పాలి. అయితే ఏకంగా దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బిజెపి ఎంతగట్టి పోటీ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ ఎంఐఎం కి తప్ప మరో పార్టీ విజయం అనేది ఎరుగదు. ఇక ఈసారి ఏకంగా ఓవైసీను ఓడించేందుకు మాధవి లతను బిజెపి బరిలోకి  దింపింది.

 ఈ క్రమంలోనే అటు ఎంఐఎం పార్టీని ఓడించేందుకు మాధవి లత ఎంతలా ప్రచారంతో దూసుకుపోయారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో మాధవి లత తప్పకుండా విజయం సాధిస్తారు అని అనుకున్నారు అందరూ. అయితే ఇక ఇప్పుడు కౌంటింగ్ ఫలితాలు చూసుకుంటే అటు హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో మరోసారి మజిలీస్ పార్టీ జెండా ఎగిరే లాగే కనిపిస్తుంది. దీంతో అటు ఎంఐఎం కంచుకోటని బద్దలు కొట్టి కాషాయ జండా ఎగరవేయాలనుకున్న బిజెపి ఆశలు నీరుగారి పోతున్నాయి. అయితే అన్ని రౌండ్లకు కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి అటు బిజెపి హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆదిత్యంలోకి వస్తుందా లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg

సంబంధిత వార్తలు: